Breaking News

రైతురాజ్యం తీసుకొస్తాం

Published on Sat, 11/25/2023 - 02:25

కొత్తపల్లి (కరీంనగర్‌): రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని, తెలంగాణలో అధికారంలోకి రాగానే రైతురాజ్యం తీసుకొస్తామని కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం వరికి రూ. 3,100 మద్దతు ధర చెల్లిస్తామని, ఎకరానికి రూ. 24 వేల సాయం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి (హెచ్‌)లో చేపట్టిన సభలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం రెండు పంటలకు కలిపి రైతులకు ఏటా రూ. 12 వేలు ఇవ్వడంతోపాటు డీఏపీ, ఇతర ఎరువుల సబ్సిడీ పేరుతో ఎకరానికి రూ. 18 వేలు చెల్లిస్తోందన్నారు.

కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరుతో ఎకరాకు రూ. 6 వేలను బ్యాంకులో జమ చేస్తోందని చెప్పారు. ఈ లెక్కన రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 24 వేలు సాయం చేస్తుంటే కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని సబ్సిడీలు బంద్‌ పెట్టి రైతుబంధు పేరుతో రూ. 10 వేలు మాత్రమే సాయం చేస్తోందని బండి సంజయ్‌ వివరించారు. పేదలకు ఇప్పటికే ఉచితంగా ‘ఉజ్వల’సిలిండర్లు ఇస్తున్నామని, బీజేపీ అధికారంలోకి రాగానే ఏటా ఉచితంగా 4 సిలిండర్లు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మంత్రి గంగుల కమలాకర్‌ అధికారంలో ఉండి ఏమీ చేయలేక.. తనపై అవినీతి ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మంత్రి తెచ్చిన ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయని... ఇప్పటివరకు ఒక్క కంపెనీ కూడా ఆ భవనంలోకి రాలేదని, ఒక్కరికీ ఉద్యోగం దొరకలేదని బండి సంజయ్‌ ఆరోపించారు. గొల్లకుర్మలకు గొర్రెలు ఇస్తామని రూ. 46 వేలు డిపాజిట్‌ చేయించుకొని మోసం చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌దని ఆయన దుయ్యబట్టారు.

రేషన్‌ మంత్రిగా ఉండి ఒక్క కొత్త రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదని, బీసీ మంత్రిగా ఉండి ఒక్కరికి బీసీ బంధు ఇవ్వలేదని ఆరోపించారు. పౌరసరఫరాలశాఖ మంత్రిగా రూ. 1,300 కోట్లను గోల్‌మాల్‌ చేశారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు భూకబ్జాదారులని, ఎవరి చరిత్ర ఏమిటో బేరీజు వేసుకొని ఓటేయాలని ప్రజలను సంజయ్‌ కోరారు.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు