Breaking News

ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి: బండి సంజయ్‌

Published on Fri, 07/21/2023 - 16:12

సాక్షి, హైదరాబాద్‌: అసంతృప్త నేతలపై బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ మండిపడ్డారు. కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ వేదికపైనే సంజయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలన్న సంజయ్‌.. కనీసం కిషన్‌రెడ్డినైనా స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వండి అంటూ హితవు పలికారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేదికపై బండి సంజయ్‌ మాట్లాడుతూ, మూర్ఖత్వ, కుటుంబ, నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కిషన్ రెడ్డి నిన్ననే యుద్ధం ప్రారంభించారు. కేసీఆర్.. గత ఎన్నికల సందర్భంగా డబుల్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడు. దీనిపై ప్రశ్నించేందుకు కిషన్ రెడ్డి బాట సింగారం వెళ్తుంటే అడ్డుకుని అరెస్టు చేశారు. కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని సంజయ్‌ వ్యాఖ్యానించారు.

గత ఎన్నికల హామీలను కేసీఆర్ నిలబెట్టుకునే వరకు బీజేపీ కార్యకర్తలు విడిచిపెట్టరు. ముఖ్యమంత్రి ఫాంహౌజ్, ప్రగతిభవన్‌లో పడుకున్నాడు. సచివాలయం నీళ్లలో మునిగిపోతున్నా పట్టించుకోవడం లేదు. కిషన్ రెడ్డి అధ్యక్షత బాధ్యతలు తీసుకుంటున్నాడని ఫస్ట్ పేజీలో వస్తుందని భావించి దాన్ని డైవర్ట్ చేసేందుకు పీఆర్సీ అంటూ చెబుతున్నాడు. ఎన్నికలు సమీపిస్తున్నాయ్ కదా.. అందుకే.. కేసీఆర్ నటించడం కాదు.. జీవిస్తున్నాడు. ఇవ్వాళ కేసీఆర్.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్‌తో ప్రచారం చేయిస్తున్నాడు’’ అంటూ బండి సంజయ్‌ దుయ్యబట్టారు.
చదవండి: బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతలు

‘‘కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌కు ఫిర్యాదులు చేయడం ఇకనైనా ఆపేయాలి. నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి నాయకుడు, కార్యకర్త నాకు సహకరించారు. చాలా కష్టపడి పనిచేశాననే తృప్తి నాకుంది.. అది చాలు. నయా నిజాం పాలనను అంతమొందించాలి. కార్యకర్తలను కాపాడుకోవాలి. నేను అధ్యక్షుడిని అయ్యాక చాలా మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు. నాన్ బెయిలబుల్ కేసులు వారిపై ఉన్నాయి. జైలుకు పంపించారు. వారు నిజమైన హీరోలు’’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు