Breaking News

బీఆర్‌ఎస్‌ ఫోన్‌ ట్యాపింగ్‌.. కాంగ్రెస్‌ వీడియో మార్ఫింగ్‌తో ప్రజాస్వామ్యం ఖూనీ

Published on Wed, 05/01/2024 - 05:21

వేములవాడ/సిరిసిల్లటౌన్‌: ఫోన్‌ ట్యాపింగ్స్‌లో బీఆర్‌ఎస్‌.. వీడియోల మార్ఫింగ్స్‌లో కాంగ్రెస్‌ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని, ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం వేములవాడలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం స్థానికంగా ఓ హోటల్‌లో జరిగింది. 

ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ ఈనెల 8న వేములవాడకు ప్రధాని నరేంద్రమోదీ వస్తున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఉదయమే ప్రధాని సభ ఉంటుందని, ఎన్నికల కోడ్‌ వల్ల ఎలాంటి ఆటంకాలు ఉండకుంటే రాజన్నను తప్పకుండా దర్శించుకుంటారని చెప్పారు. పదేళ్ల కాలంలో రాష్ట్రంలో నీచ రాజకీయాలు జరిగాయని, సభ్యసమాజం తలదించుకునేలా బీఆర్‌ఎస్‌ నాయకులు ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారన్నారు. 

ఇక కాంగ్రెస్‌ నేతలు ఫేక్‌ వీడియోలు తయారు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లను బీజేపీ పక్కాగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ఎంపీ సంజయ్‌తోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు బైపాస్‌రోడ్డులోని పలు ఖాళీ స్థలాలను పరిశీలించారు. రెండు రోజుల్లో సభ స్థలాన్ని ఫైనల్‌ చేస్తామని వారు చెప్పారు.  

రేవంతన్నా.. నా గుండుతో నీకేమన్నా.. 
‘రేవంతన్నా.. నా గుండుతో నీకేం పనన్నా.. నేను ఆరు గ్యారంటీల గురించి అడిగితే గుండు.. అరగుండు’అంటూ అవహేళనగా మాట్లాడుతున్నావని ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై మంగళవారం రాత్రి సిరిసిల్లకు వచ్చిన బండి గట్టి కౌంటర్‌ ఇస్తూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. 

సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి భాషను చూసి జనాలు అసహ్యించుకుంటున్నారన్నారు. మీరు ఎన్ని అవాకులుచవాకులు మాట్లాడినా కరీంనగర్‌లో తాను భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ, గంగాడి మనోహర్‌రెడ్డి, గండ్ర నళిని, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)