Breaking News

కాంగ్రెస్‌ దోఖేబాజ్‌ పార్టీ

Published on Mon, 03/04/2024 - 04:24

హుజూరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ దోఖేబాజ్‌ పార్టీ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ మండిపడ్డారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఓట్లు దండుకున్న ఆ పార్టీ.. అధికారంలోకొచ్చాక వాటికి కోతలు పెడుతూ ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఇళ్లకోసం లక్షలాది కుటుంబాలు పదేళ్లుగా అల్లాడుతుంటే నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాహితయాత్రలో భాగంగా ఆదివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన పాదయాత్ర చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే రూ.5 లక్షల కోట్లు అవసరమని, ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మహిళలకు ప్రతినెలా రూ.2,500, ఆసరా కింద రూ.4 వేలు, రూ.రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామంటే ప్రజలు ఓట్లేశారని, ఇప్పటివరకు ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్రంలో 90 లక్షల తెల్లరేషన్‌ కార్డులుంటే.. అందులో 40 లక్షల మందికి మాత్రమే రూ.500కు గ్యాస్‌ సిలిండర్, రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్‌ను అమలు చేస్తామంటున్నారని, మిగిలిన వారి సంగతేంటని ప్రశ్నించారు. నరేంద్రమోదీ లేని భారత్‌ను ఎవరూ ఊహించుకోవడం లేదని, మోదీని మూడోసారి ప్రధానిగా చేసేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని పేర్కొన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ తమకు పోటీయే కాదని, గతంలోకంటే భారీ మెజార్టీతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని బండి చెప్పారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)