Breaking News

నన్ను ఓడించాలని కుట్ర చేస్తే.. కేసీఆర్‌ అడ్రస్‌ గల్లంతైంది!

Published on Wed, 06/05/2024 - 03:43

కరీంనగర్‌టౌన్‌: ‘బండి సంజయ్‌ గలీజోడు.. ముస్లింలంతా ఏకమై నన్ను ఓడించాలని కేసీఆర్‌ పిలుపునిచి్చండు. ఏమైంది? అందరూ ఏకమై నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. కేసీఆర్‌ అడ్రస్సే గల్లంతు చేశారు’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. మంగళవారం ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం సంజయ్‌ కరీంనగర్‌లోని ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లి రిటరి్నంగ్‌ అధికారి నుంచి గెలుపు ధ్రువీకరణపత్రం అందుకున్నారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనను ఓడించేందుకు ఒకవర్గం ఓట్లను ఏకం చేయాలనుకున్న కేసీఆర్, కాంగ్రెస్‌ నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తిప్పి కొట్టారని అన్నారు. ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించారని, కరీంనగర్‌ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవాతోనే తనకు ఇంతటి మెజారిటీ దక్కిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాడి ఆ పార్టీ అంతు చూస్తామని హెచ్చరించారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం అభివృద్ధి కోసం గతం కన్నా ఎక్కువ నిధులు తీసుకొస్తానని, మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

కాగా, ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లేముందు, ఆ తర్వాత గెలుపు ధ్రువీకరణ పత్రం అందుకున్న అనంతరం ఇంటికి చేరుకుని సంజయ్‌ తన తల్లి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఆయన గెలుపు సందర్భంగా కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు. కుటుంబ సభ్యులతో కలసి సంజయ్‌ ఈ సంబరాల్లో పాల్గొన్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)