Breaking News

బీఆర్‌ఎస్‌పై ఇంత విద్వేషమా?

Published on Sun, 06/16/2024 - 04:03

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ రెడ్డి హయాంలో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, బీఆర్‌ఎస్‌ పార్టీపై విద్వేషంతో వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ విమర్శించారు. స్వయంగా సీఎం నిర్వహిస్తున్న విద్యా శాఖలోనే గందరగోళ పరిస్థితి ఉంటే ఎలా అని నిలదీశారు.  కేసీఆర్‌ ఫొటోలు, పేర్లు ఉన్నాయని స్కూలు పిల్లల పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం వెనక్కి తెప్పించడం దారుణమని వ్యాఖ్యానించారు.

మాజీ ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, టీఎస్‌టీఎస్‌ మాజీ చైర్మన్‌ రాకేశ్‌ కుమార్‌తో కలిసి బాల్క సుమన్‌ శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు బంధు పంపిణీని ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించిన బీఆర్‌ఎస్‌ నేతలు.. హోం శాఖ స్వయంగా సీఎం అధీనంలో ఉన్నా ఆయన సొంత జిల్లాలో పట్ట పగలు వ్యక్తిని కొట్టి చంపారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గంజాయి మూకలు స్వైర విహారం చేస్తున్నాయని, హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. మద్యం, ఇసుక, ఫ్లై యాష్‌ రవాణాలో కమీషన్లు తీసుకోవడంలో సీఎం బిజీగా వున్నారని బాల్క సుమన్‌ విమర్శించారు.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)