Breaking News

పులివెందులలో హైటెన్షన్‌.. వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌కు భారీగా పోలీసులు

Published on Tue, 08/12/2025 - 14:04

సాక్షి,  వైఎస్సార్‌సీపీ: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ.. పోలీసుల కుట్రలు కొనసాగాయి  డీఐజీ కోయ ప్రవీణ్‌ ఫుల్‌ పోలీస్‌ఫోర్స్‌తో మంగళవారం మధ్యాహ్నాం వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్దకు వచ్చారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని ఆఫీస్‌లోనే నిర్బంధించారు.

పోలీసులు అక్కడికి వచ్చిన సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను దూషించారు. అయితే తమను రెచ్చగొట్టవద్దంటూ కొందరు పోలీసుల కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశారు. అది గమనించిన కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి కార్యకర్తలను వద్దని వారించారు. 

‘‘పులివెందులపై చంద్రబాబు, లోకేష్‌లు పగబట్టారు. రిగ్గింగ్‌ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. పోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారు. ఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండి. కార్యకర్తలు సంయమనం పాటించండి. అన్నింటిని న్యాయపరంగా ఎదుర్కొంటాం’’ అని కార్యకర్తలను ఉద్దేశించి అవినాష్‌ అన్నారు. 

అయితే తాము భద్రత కల్పించేందుకు వచ్చామని పోలీసులు చెప్పగా.. ఆ అవసరం లేదని, మా ఓటు మమ్మల్ని వేసుకోనివ్వాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు కోరాయి. ఈ క్రమంలో అవినాష్‌ రెడ్డిని ఆఫీస్‌లోపలే ఉంచి కోయ ప్రవీణ్‌ అక్కడే ఉండిపోయారు. అంతకు ముందు.. 

ఈ ఉదయం అవినాష్‌ రెడ్డిని నివాసం నుంచి పోలీసులు బలవంతంగా తమ వెంట తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పోలీసుల చెర నుంచి విడుదలైన వైఎస్‌ అవినాష్‌​ రెడ్డి కడప కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. అక్కడ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి వైఎస్సార్‌సీపీ చేయగలిగింది ఇదొక్కటే. కోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు. దౌర్జన్యం చేసుకునేందుకు, ప్రజల్ని ఓట్లు వేయనీకుండా చేసేందుకు, బూత్ క్యాప్చర్లు చేసుకుని యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకునేందుకు అధికారం ఎంతటి వెసులుబాటు ఇస్తుందో ఈ ఎన్నికలే ఉదాహరణ. విచారకరం ఏమంటే ఇన్ని దారుణాలు జరిగినా TDP will get away with it.

పులివెందులలో YS అవినాష్ రెడ్డి నిర్బంధం

ఈ ఎన్నిక గెలిచినా టీడీపీ తాను ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నది మాత్రం చేయలేదు. ఈ ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలు చూసారు. ప్రజలను కనీసం బూతుల వద్దకు రానీకుండా అడ్డుకుని టీడీపీ అన్ని హద్దులు చేరిపివేసింది. కోర్టు తీర్పు వైసీపీకి అనుకూలంగా వస్తే మాత్రం టీడీపీకి ఎంబారెస్మెంట్ తప్పదు అని అవినాష్‌ రెడ్డి అన్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)