Breaking News

ఘొల్లుమనే జోకులేసిన రఘురామ

Published on Wed, 05/15/2024 - 13:49

పశ్చిమ గోదావరి, సాక్షి: ఓడలు ఏదో ఒకనాటికి బండ్లు అవుతాయంటే ఇదేనేమో. తొమ్మిదేళ్లలో ఐదుసార్లు పార్టీలు మార్చిన కనుమూరి రఘురామకృష్ణంరాజు..  చివరకు అనుకున్న సీటు దక్కించుకోలేక, ఓ అసెంబ్లీ సీటు సంపాదించుకోవడం కోసం ఎంతగా దిగజారుడు రాజకీయాలు చేశారో తెలుగు రాష్ట్రాలు కళ్లారా చూశాయి.

ఈ ఐదేళ్లలో రఘురామ వెలగబెట్టింది ఏంటో అందరికీ తెలిసిందే. చంద్రబాబు డైరెక్షన్‌లో నిత్యం సీఎం జగన్‌ను, ఏపీ సర్కార్‌ను విమర్శిస్తూ.. ఢిల్లీలో ఉంటూ కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేస్తూ కాలం వెల్లదీశారు. అయితే ఎన్నికలు ముగిసినా కూడా రఘురామ తన డ్యూటీని ఇంకా మానలేదు. పాపం స్పీకర్‌ సీటు మీద ఆయనకు ఆశలున్నాయేమో కదా. అందుకే.. పుట్టినరోజున కూడా ఘొల్లుమనే జోకులేశారు. జోస్యం పేరిట రఘురామ పేల్చిన ఆ జోకులనే యెల్లో మీడియా తెగ ప్రచారం చేసుకుంటోంది. 

నిన్న(మే 14న) రఘురామ పుట్టినరోజు. పాపం.. పెద అమిరంలోని తన ఆఫీస్‌లో రచ్చబండ పెట్టారుకానీ జనాలు మాత్రం రాలేదు. అయినా రఘురామ తగ్గలేదు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందంటూ బిగ్గరగా మాట్లాడారు. ఏపీ కూటమి ఏకంగా 150కిపైగా సీట్లు దక్కించుకుందట. అధికారంలోకి వస్తుందట. ఆ మాటకు పక్కనున్న టీడీపీ నేతలు బయటకే నవ్వుకోవడం కనిపించింది. రఘురామ జోకులు అంతటితో ఆగలేదు.

తనపై మత వ్యతిరేకుడనే ముద్ర వేయించారని తెగ ఫీలైపోయారు. అంతేకాదు.. తన శపథం నెరవేరిందని, పోలింగ్‌కు జనం పెద్ద ఎత్తున తరలిరావడమే కూటమి గెలుస్తుందనడానికి సంకేతమంటూ మాట్లాడారు. అయితే రఘురామ వాస్తవాల్ని గ్రహించలేకపోతున్నారు. పోటెత్తిన ఓటర్లలో జగనన్న పాలనలో సంక్షేమం అందుకున్న లబ్ధిదారులు, ఆ సంక్షేమం కొనసాగాలని కోరుకుంటున్న మహిళా ఓటర్లు..  అదే టైంలో ఇంకోవైపు పెన్షన్లు ఇంటికే అందక ఇబ్బందులు పడి చంద్రబాబును తెగ తిట్టుకున్న అవ్వాతాతలు.. అధికంగా ఉన్నారు. మరి వాళ్లంతా తిరిగి ఎవరికి పట్టం కడతారో ఊహించలేమా?. అయినా.. రాబోయేది జగన్‌ సర్కారే అని చెప్పడానికి గోదావరి జిల్లాల సిద్ధం సభలకు లభించిన స్పందన చాలాదా?. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)