Breaking News

ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన బొత్స.. జగన్‌ అభినందనలు

Published on Wed, 08/21/2024 - 11:38

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు తన చాంబర్‌లో బొత్సతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘మండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉంది. మా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నమ్మకం పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు. శాసనసభ, శాసన మండలి లో ప్రజల కోసం నిలబడతాం. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చెయ్యాలి. మేము ప్రజల గొంతుక గా సభలో వ్యవహరిస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినప్పుడు ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపాం. రాష్ట్రంలో జరుగుతున్న దమన కాండ ను దేశానికి చాటి చెప్పారు. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాలి. కేసులు పెడుతున్నారు..పెట్టుకొనివ్వండి. ప్రభుత్వం లో వాళ్లే ఉన్నారు కదా. విచారణలు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం’’ అని అన్నారాయన. 

అంతకు ముందు.. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారాయన. ఈ సందర్భంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను జగన్‌ అభినందించారు. జగన్ ని కలిసిన వారిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు పలువురు ఉన్నారు. 

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కూటమి కుట్రలు చేసి అభ్యర్థిని నిలబెడదామని భావించినప్పటికీ.. వైఎస్సార్‌సీపీకి సంపూర్ణ మద్ధతు ఉండడం.. ఆ పార్టీ అధినేత జగన్‌ దిశానిర్దేశంతో ఆ పార్టీ నేతలంతా ఏకతాటిపై నిలబడి బొత్సను గెలిపించుకున్నారు. మూడేళ్లపాటు బొత్స ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.

ఎమ్మెల్సీ బొత్సను అభినందించిన వైఎస్‌ జగన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)