Breaking News

పవన్‌ ఫ్లాప్‌.. చంద్రబాబు జిమ్మిక్కే!

Published on Mon, 10/02/2023 - 12:47

సాక్షి, గుంటూరు:  ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు తర్వాత అనైతిక వ్యక్తి పవన్‌ కల్యాణేనని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబుతో కలిసొస్తే ఆదరణ ఉండదనే విషయం వారాహి యాత్ర ఫ్లాప్‌తో పవన్‌కు ఇప్పుడు అర్థమైందని అంబటి తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జనసేన చీఫ్‌ తీరుపై మండిపడ్డారు. 

కొండనాలికకు మందేస్తే.. ఉన్ననాలిక ఊడిందన్న చందాన వారాహి యాత్ర తయారైంది. చంద్రబాబుతో కలిసి వస్తున్నానని చెప్పగానే వారాహి-4 యాత్ర ఫ్లాప్‌ అయ్యింది. కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లి పవన్‌ సభలు పెడుతున్నారు. ఇదంతా నక్కజిత్తుల చంద్రబాబు జిమ్మిక్కు. పవన్‌ సభలకు వెళ్లండి అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. కానీ, సాయంత్రం ఆరు గంటలైనా జనం పవన్‌ సభకు రాలేదు. చంద్రబాబుతో పొత్తును ప్రజలు ఛీ కొట్టారు. బీజేపీతో ఉన్నాను అంటావ్‌.. టీడీపీతో వెళ్తాను అంటావ్‌. బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీతో కలిసేందుకు సిగ్గు లేదా? అని పవన్‌ను అంబటి ప్రశ్నించారు. 

పవన్‌ ఏం చెబుతారో అని ప్రజలంతా ఎదురు చూశారు. కానీ, జైలుకెళ్లి చంద్రబాబును పరామర్శించి పొత్తు పెట్టుకున్నారు. పవన్‌ చంద్రబాబును వాడుకుంటున్నారు. చంద్రబాబుతో పొత్తు ప్రకటన తర్వాత పవన్‌ బాడీలాంగ్వేజ్‌ మారిపోయింది. రాజకీయాలకు పనికి రాని వ్యక్తి.. చంద్రబాబు చెప్పులు మోసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. 

జనసేన కార్యకర్తలు ఇక జనసైనికులు కాదు.. సైకిల్‌సైనికులు. సైకిల్‌కు తప్పు పట్టింది.. టైర్లు లేవు. చంద్రబాబు అవినీతి డబ్బుతో వారాహి యాత్ర జరుగుతోంది. జనసేన అవినీతి జెండా కూడా చంద్రబాబు అవినీతి డబ్బుతోనే ఎదుగుతోంది. ‘‘సర్వనాశనం అయిపోయిన టీడీపీని బతికించాలనుకుంటున్నావ్‌. బందర్‌ సభలోనైనా నీ క్యాడర్‌కు ఓ క్లారిటీ ఇవ్వు. బీజేపీతో ఉన్నావో లేదో నీ క్యాడర్‌కైనా చెప్పు’’ అని పవన్‌ను ఉద్దేశించి అంబటి అన్నారు. ఈసారి తప్పు జరిగితే ఊరుకోనంటూ పవన్‌ మాటలు చెబుతున్నాడు. మరి 2014 టీడీపీ అరాచకాలను ఎందుకు ప్రశ్నించలేదు అని అంబటి ప్రశ్నించారు. 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)