Breaking News

కేంద్ర కేబినెట్‌ కూర్పు.. ఏపీకి ఎన్ని?

Published on Fri, 06/07/2024 - 08:36

సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో ఏపీకి నాలుగు లేదా ఐదు మంత్రి పదవులు దక్కే అవకాశం అవకాశముంది. టీడీపీ నుంచి మగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి ఛాన్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. నాలుగు మంత్రి పదవులు, లోక్ సభ స్పీకర్ కోసం టీడీపీ యత్నాలు సాగిస్తోంది.

టీడీపీకి రెండు మంత్రి‌ పదవులు, ఒక సహాయ మంత్రి పదవి లేదా డిప్యూటీ స్పీకర్ ఇచ్చే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలిసింది. టీడీపీకి కేంద్రంలో చక్రం తప్పే అవకాశం వచ్చినా కీలక శాఖలు దక్కటం అనుమానమే. ఉక్కు శాఖ, పౌర విమానయాన శాఖలు టీడీపీకి దక్కుతాయని ప్రచారం జరుగుతోంది.

ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన నాయుడు, గోదావరి జిల్లాల నుంచి గంటి హరీష్, పుట్టా మహేష్ యాదవ్, కోస్తా జిల్లాల నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయులు, వేమిరెడ్డి  ప్రభాకర రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, రాయలసీమ నుంచి బికె పార్ధసారధి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఏపీ బీజేపీ నుంచి ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. మహిళా కోటాలో పురందేశ్వరి పేరు బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. చంద్రబాబు లాబీయింగ్‌తో కేంద్ర మంత్రి వర్గంలో సీఎం రమేష్ చోటు కోసం యత్నిస్తున్నారు. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)