Breaking News

వైఎస్సార్‌సీపీ నేతలపై అప్పటివరకు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు

Published on Tue, 07/23/2024 - 13:04

సాక్షి, విజయవాడ: తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.

సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలను కేసుల్లో ముద్దాయిలుగా లేరని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ముద్దాయిలుగా చేర్చితే అరెస్ట్ చేసే అవకాశం ఉందని పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. సజ్జల, ఆర్కేలను ముద్దాయిలుగా చేర్చితే నోటీసులు ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  నోటీసులు ఇచ్చిన 5 రోజులు వరకు అరెస్ట్ చేయవద్దని హై కోర్టు స్పష్టం చేసింది.

ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్, నందిగాం సురేష్‌కు సంబంధించిన విచారణను ఆగస్టు 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు చర్యలు ఏమీ తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది. మాజీ మంత్రి జోగి రమేష్ పిటిషన్‌పై 14వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటివరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)