Breaking News

TDP : మూడో జాబితా చూస్తే వెన్నుపోటు అంటే ఏంటో తెలుస్తుంది

Published on Fri, 03/22/2024 - 11:17

సాక్షి, గుంటూరు: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీకి సంబంధించి 11 మంది, అలాగే 13 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను శుక్రవారం ఉదయం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఊహించినట్లుగానే ఆశావహుల్లో కొందరికి అధిష్టానం మొండి చేయి చూపించింది. సీనియర్లలో కొందరికి సీట్లు దక్కగా.. మరికొందరికి మాత్రం చంద్రబాబు ఝలక్‌ ఇచ్చారు. తన సామాజిక వర్గానికి పెద్ద పీట వేసుకున్న చంద్రబాబు.. బడుగు, బలహీన వర్గాలకు వెన్నుపోటు అంటే రుచి చూపించారు.

40 ఇయర్స్‌ ఇండస్ట్రీ మరీ.!

  • భీమిలి నుంచి గంటాకు నో, మూడో జాబితాలో మొండి చేయి, చీపురుపల్లి నుంచి చేస్తే చేయ్‌.. లేదంటే తప్పుకో అంటూ గంటాకు సూచన చేసినట్టు తెలిసింది.
  • తెలుగుదేశం రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు
  • శ్రీకాకుళంలో సీటు ఆశించి భంగపడ్డ గుండా లక్ష్మీదేవి, డబ్బు సంచులకే ప్రాధాన్యం తనను పక్కనబెట్టారని అంటున్నారు
  • విశాఖ ఎంపీగా పోటీ చేయాలనుకున్న జీవీఎల్‌కు చోటు దక్కకుండా చక్రం తిప్పాడు, బాలకృష్ణ తోడల్లుడి కొడుకు భరత్‌కు విశాఖ ఎంపీ సీటు ప్రకటించాడు,
  • కేవలం కుటుంబ సభ్యుల కోసమే విశాఖ సీటును టిడిపికి అప్పగించారని పురందేశ్వరీ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
  • నిజమైన బీజేపీ కార్యకర్తలకు కాకుండా.. కుటుంబ సభ్యుల కోసం పార్టీని తాకట్టు పెట్టారని మండిపడుతున్నారు.
  • మైలవరంలో దేవినేని ఉమా మొదటి నుంచి ఆరోపిస్తున్నాడు. ఆయన చెప్పినట్టుగానే వంద కోట్లు ఇచ్చిన కృష్ణప్రసాద్‌కు టిడిపి టికెట్‌ ఇచ్చినట్టు తాజా జాబితా బట్టి తేలిపోయింది. డబ్బుల పోటీలో దేవినేని ఉమా వెనకబడిపోయారు. పార్టీలో చేరగానే వసంతకు టికెట్‌ ఇచ్చాడు బాబు.
  • డబ్బు సంచులకే టికెట్లు అన్నది శ్రీకాకుళంలో పక్కాగా నిరూపణ అయింది. శంకర్‌, గోవింద్‌రావు ఇద్దరిది అదే అర్హత అన్న విమర్శలున్నాయి
  • పెనమలూరు టికెట్ పార్ధసారధి యాదవ్‌కు ఇస్తానని టీడీపీ లోకి తీసుకొని నూజివీడుకు పంపించారు చంద్రబాబు. అక్కడ  బోడె ప్రసాద్ చౌదరికి ఇచ్చాడు.
  • అలాగే గత ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి నుంచి ఎన్నికైన ఉండవల్లి  శ్రీదేవిని ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆశ పెట్టి ఓటు వేయించుకున్నాడు. తీరా అవసరం తీరిన తర్వాత మొండిచేయి చూపించాడు బాబు.

కాపు ,యాదవ, చేనేత ,బిసీ సామాజిక వర్గాలకు పోటీగా కమ్మలను రంగంలోకి దించినట్టు తేలిపోయింది.

  • విశాఖ  ఎంపీగా భరత్  (కమ్మ) vs  బొత్స ఝాన్సీ (కాపు)
  • గుంటూరు ఎంపీ గ పెమ్మసాని  (కమ్మ)  vs కిలారు రోశయ్య(కాపు)
  • నరసారావు పేట ఎంపీగా లావు vs అనిల్ యాదవ్ (యాదవ బీసీ)
  • మంగళగిరి లో లోకేష్ vs  కాండ్రు లావణ్య (చేనేత బీసీ )
  • కుప్పం లో బాబు vs  భరత్  (వన్నెకుల క్షత్రియా బిసీ )

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)