Breaking News

మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి

Published on Mon, 05/13/2024 - 14:46

సాక్షి, పల్నాడు: ప్రశాంతంగా జరుగుతున్న ఎన్నికల వాతావరణాన్ని దెబ్బ తీసేందుకు తెలుగు దేశం పార్టీ ప్రయత్నిస్తోంది. ఓటమికి ముందుగానే భయపడి.. పోలింగ్‌కు కొన్నిరోజుల ముందు నుంచే దాడుల పర్వానికి దిగింది. ఈ క్రమంలో మాచర్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు దాడికి యత్నించాయి.  

పోలింగ్‌బూత్‌ పరిశీలనకు పిన్నెల్లి వెళ్తున్నారనే సమాచారంతో టీడీపీ శ్రేణులు మాటు వేశాయి. రెంటచింతల మండలం పాల్వాయి గేటు వద్ద టీడీపీ గుండాలు దాడికి దిగారు. కర్రలు.. రాడ్లు.. మారణాయుధాలతో దాడికి దిగారు. ఈ దాడి నుంచి పిన్నెల్లి సురక్షితంగా బయటపడగా, ఆయన తనయుడు గౌతమ్‌రెడ్డికి గాయాలు అయ్యాయి.

అయితే.. పది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తలలు పగిలాయి. అదే సమయంలో పిన్నెల్లి వాహన శ్రేణి పూర్తిగా ధ్వంసం అయ్యింది.

సాక్షి టీవీతో గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ..
ఉదయం నుంచి పాల్వాయి గేట్ ఓటర్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఆ సమాచారం అందుకుని  పాల్వాయి గేటు వద్దకు మేం వెళ్ళాం. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు రౌడీలాగా ప్రవర్తిస్తూ మా నాన్నపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. మేం అడ్డుకోవడంతో మమ్మల్ని విచక్షణారహితంగా కొట్టారు. మారణాయుధాలతో దాడి చేశారు. నాతోపాటు కార్యకర్తల తలలు పగిలాయి. మాపై దాడి చేసిన వారిలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మ రెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారు . ఇంత జరుగుతున్నా కారంపూడి సీఐ నారాయణ స్వామి స్పందించలేదు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)