Breaking News

‘ఇది చాలా తప్పు నారా లోకేష్‌’.. ఏబీవీపీ ఆగ్రహం

Published on Thu, 08/21/2025 - 16:43

సాక్షి, విజయవాడ: ఏపీలో విద్యా రంగం నిర్జీవమైపోయిందంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి మండిపడ్డారు. యువగళంలో నారా లోకేష్ యువతకు చాలా హామీలిచ్చారు. మార్చిలో ఇంటర్ పరీక్షలు పూర్తైతే.. ఈరోజుకీ డిగ్రీ అడ్మిషన్ల పట్ల స్పష్టత లేదు.. ఐదు నెలలు పూర్తైంది.. విద్యార్థులకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందంటూ మంత్రి నారా లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘అడ్మిషన్లు ఆలస్యం కావడంతో విద్యార్థులు ప్రైవేట్ యూనివర్శిటీలకు వలస పోతున్నారు. ప్రైవేట్ యూనివర్శిటీల వద్ద తీసుకున్న లంచాల కారణంగానే అడ్మిషన్లు ఆలస్యం అవుతున్నాయని అనుమానాలొస్తున్నాయి. మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ బహిరంగంగా విడుదల చేయలేదు. మీ పార్టీ కార్యకర్తలకు డీఎస్సీ పోస్టులు ఇవ్వాలనే ఆలోచన కనిపిస్తోంది. మెరిట్ లిస్ట్‌ను మెసేజ్‌లు పెట్టి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పడం ముమ్మాటికీ తప్పు

..రోస్టర్, మెరిట్ లిస్ట్ ప్రకారమే నియామక పత్రాలు అందించి రిక్రూట్ మెంట్ జరపాలి. ప్రైవేట్ యూనివర్శిటీల్లో చదివే పీజీ విద్యార్ధులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని చెప్పారు. ఐసెట్, పీజీ సెట్లు అయిపోయినా ఇంతవరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల ఆవరణలోకి విద్యార్ధి సంఘాలు రాకూడదని జీవో ఇవ్వడం దారుణం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి పనిచేస్తున్నారు

..యూనివర్శిటీల్లో ప్రైవేట్ కార్యక్రమాలు చేయొద్దంటారు. మీరు మాత్రం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలలు ఉండాలని మీరే అంటారు. కానీ మీరే రాజకీయ కార్యకలాపాలు పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి నారా లోకేష్ పునరాలోచన చేసి జీవోను ఉపసంహరించుకోవాలి. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి’’ అని  యాగంటి వెంకట గోపి డిమాండ్‌ చేశారు.

స్కూళ్లు, కాలేజీల ఆవరణలో డ్రగ్స్ దందా విపరీతమైపోయింది. మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్వహించాలి. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తాం’’ అని  వెంకట గోపి హెచ్చరించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)