తస్సుమనిపించిన పవన్‌ ఢిల్లీ పర్యటన!

Published on Wed, 11/06/2024 - 19:52

న్యూఢిల్లీ, సాక్షి: హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. గంట గడవక ముందే తిరుగుపయనం అయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో  భేటీ అని చెప్పి హడావిడి చేసి.. కేవలం 10-15 నిమిషాలపాటే ఆయనతో చర్చించారు. తీరా బయటకు వచ్చాక ‘జరిగింది మర్యాదపూర్వక భేటీ’ అని స్టేట్‌మెంట్‌ ఇచ్చి తుస్సుమనిపించారు.

ఏపీ కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ అగ్రనేతతో, అందునా హోం మంత్రితో పవన్‌ కల్యాణ్‌ భేటీ అవుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అందుకు.. రెండ్రోజుల కిందట పవన్‌ చేసిన సంచలన వ్యాఖ్యలే కారణం. ఏపీలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని, పోలీసులు పదే పదే చెప్పించుకుంటున్నారని, హోం మంత్రి అనిత కూడా బాధ్యతయుతంగా ఉండాలని.. లేనిపక్షంలో తప్పుకోవాలని హెచ్చరించారు. అలాగే.. తాను హోం మంత్రి పదవి తీసుకుంటే పరిస్థితులు మరోలా ఉంటాయని వ్యాఖ్యానించారు.

దీంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కూటమి పార్టీల నడుమ నిజంగానే ఏదైనా జరుగుతోందా? లేదంటే డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ డ్రామానా? అనే అనుమానాలు తలెత్తాయి. ఈలోపే.. పవన్‌ ఉన్నపళంగా ఢిల్లీకి వెళ్లి హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అవుతుండడంపై అనేక కోణాల్లో చర్చ నడిచింది. పవన్‌ తాజా వ్యాఖ్యలే ప్రధానాంశంగా ఈ భేటీ ఉండొచ్చనే కోణమూ అందులో ఉంది.  

కానీ, వాటన్నింటిని పటాపంచల్‌ చేస్తూ.. మర్యాదపూర్వక భేటీ అని చెప్పి తుస్సుమనిపించారు. దీంతో ఇది కూడా డ్రామానేనా? అనే అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అంతేకాదు డిప్యూటీ సీఎం హోదాలో తన తొలి ఢిల్లీ పర్యటనలోనే ప్రజాధనాన్ని పవన్‌ ఇలా వృథా చేశారన్నమాట.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)