Breaking News

చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

Published on Fri, 01/17/2025 - 10:03

అమరావతి, సాక్షి: బ్యూరోక్రసీతో తనకు ఎలాంటి అవసరం లేదని.. తాను కేవలం రాజకీయ పాలనే చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ తరహా పాలన అంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఏపీలో ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగం(Red Book Constitution) అమలుతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. వ్యవస్థలన్నీ కుంటుపడిపోయాయి. సంక్షేమ పథకాలు మూలనపడ్డాయి. ఈ తరుణంలో.. ఇక రాజకీయ పాలనతో ఆ పరిస్థితిని మరింత దిగజార్చాలన్నది చంద్రబాబు (Chandrababu) ప్రయత్నంగా కనిపిస్తోంది. 

‘‘రాజకీయ పాలనకు కట్టుబడి ఉన్నాం.  రాయలసీమ తరహాలో ఒకరి పోస్ట్‌మార్టమ్‌కు కారణమైన వారికి కూడా పోస్ట్‌మార్టం తప్పదు. సోషల్‌ మీడియాలో విర్రవీగిన వారిని కంట్రోల్‌లో పెట్టాం. ఒకరిని చంపితే ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని.. ఉన్న నలుగురిలో ఎవరో ఒకరు ఆ చంపిన వ్యక్తిని చంపుతారు. పార్టీ మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లింది పార్టీ కార్యకర్తలే తప్ప బ్యూరోక్రసీ కాదన్నారు. అందువల్ల కచ్చితంగా రాజకీయ పాలనే ఉంటుంది’’

రాజకీయ పాలన పేరుతో మళ్ళీ జన్మభూమి కమిటీ(Janmabhoomi Committee)ల రంగప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీల కుటుంబాలకు పెన్షన్లు కట్ అయ్యాయి. ఏ పని కావాలన్నా టీటీడీ నేతల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే.. తమ నేతలు చెప్పిన వారికే పనులు చేయాలని అధికారులకూ ఆదేశాలు వెళ్లాయి. 

కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తొలినాళ్లలోనే మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి. కుర్చీలో కూర్చోపెట్టి కాఫీ ఇచ్చి మరీ పని చేసిపెట్టాలని ఆయన అన్నారు. ఇక ఇప్పుడు ఏపీలో రాజకీయ పాలనతో అధికార యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది. అర్హులకు పెన్షన్లు అందడం లేదు.. అలాగే ఇతర ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి కూడా.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)