Breaking News

పవన్‌ వ్యాఖ్యలపై మంత్రివర్గంలో చర్చ

Published on Thu, 11/07/2024 - 05:59

సాక్షి, అమరావతి: చిన్నారులు, మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మూడు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. చివరలో చంద్రబాబు ప్రత్యేకంగా మంత్రులతో రాజకీయా­లు, ఇతర అంశాలపై మాట్లాడారు. ఈ సమయం­లో పవన్‌ కళ్యాణ్‌ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది. సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్టులపై పోలీసులు సరిగా స్పందించడం లేదని, అందుకే అలా మాట్లాడా­ల్సి వచ్చిందని చెప్పినట్లు లీకులిచ్చారు. 

కొందరు అధికారుల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తోందని ఈ సందర్భంగా పలువురు మంత్రులు చెప్పినట్లు సమాచారం. కొన్ని జిల్లాల ఎస్పీలు తమ ఫోన్లు తీయడం లేదని ఒకరిద్దరు మంత్రులు చెప్పినట్లు తెలిసింది. పోలీసు యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవడం లేదని, కింది స్థాయి అధికారులపై నెపం మోపి తప్పించుకుంటున్నారని చెప్పగా, చంద్రబాబు స్పందిస్తూ నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిలో పెడతానని చెప్పినట్లు సమాచారం. రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవ­నాలను దేనికీ ఉపయోగించకుండా మ్యూజియంగా మార్చి అందరికీ చూపిద్దామని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. 

పవన్‌ వ్యాఖ్యలపై టాపిక్‌ డైవర్ట్‌ 
పవన్‌ వ్యాఖ్యలపై మంత్రివర్గంలో చర్చ అంతా జరిగిన నష్టాన్ని కవర్‌ చేసుకునే క్రమంలోనే సాగినట్లు తెలిసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని, ఆడబిడ్డలను రేప్‌ చేస్తుంటే సరైన చర్యలు తీసుకోవడం లేదన్న వ్యాఖ్యలకు విరుద్ధంగా టాపిక్‌ను డైవర్ట్‌ చేసి.. మంత్రివర్గంలో చర్చించడం గమనార్హం. ఆ విషయాలపై కాకుండా వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా గురించి పవన్‌ వ్యాఖ్య­లు చేసినట్లు చర్చలు జరిపినట్లు తెలిసింది. 

హోం మంత్రిని, డీజీపీని పవన్‌ నిలదీసిన ప్రస్తావన సమావేశంలో రాకపోవడం విశేషం. పవన్‌ వ్యాఖ్యలతో రాష్ట్రంలో శాంతి భద్రతల డొల్లతనం బయట పడడంతో ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోయింది. దాన్ని కవర్‌ చేసేందుకు వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియాపై చర్యలు తీసుకోవాలన్న దానిపై పవన్‌ మాట్లాడినట్లు డైవర్ట్‌ చేసి దానిపై చర్చ జరిగేలా చేసినట్లు తెలిసింది.  

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)