Breaking News

పొత్తులపై ఏపీ బీజేపీ మరోసారి క్లారిటీ

Published on Sun, 03/03/2024 - 20:53

సాక్షి, విజయవాడ: బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్న చంద్రబాబుకు షాక్‌ తగిలింది. జనసేనతో జతకట్టిన చంద్రబాబు.. ఘోర ఓటమి భయం వెంటాడటంతో బీజేపీతో పొత్తు కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి. అయితే, పొత్తులపై ఏపీ బీజేపీ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది.

రెండు రోజుల సమావేశాల్లో పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందే‍శ్వరి తెలిపారు. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తులు చేశామని, 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్ధానాల్లో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియని చేపట్టామని ఆమె పేర్కొన్నారు.

‘‘26 జిల్లాలు.. 175 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీశాం. అభ్యర్థుల ఎంపిక.. సామాజిక సమీకరణ సహా అన్ని అంశాలపై చర్చించాం. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి నివేదిస్తాం. పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తారు. నిర్ణయిస్తారు. పొత్తులు సహా ఎలాంటి నిర్ణయమైనా పార్టీ హైకమాండ్‌దే’’ అని పురందేశ్వరి స్పష్టం చేశారు.

మరోవైపు, బీజేపీలోని చంద్రబాబు మద్దతుదారులు పొత్తు కోసం ఢిల్లీలో పైరవీ చేస్తున్నా.. ఢిల్లీ పెద్దలు మాత్రం అంగీకరించడంలేదని టాక్‌. బీజేపీలో చేరినప్పటికీ వీరు చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలే చెబుతుంటారు. అందుకోసమే చంద్రబాబు డైరక్టన్‌లోనే బీజేపీ వైపు నుంచి పొత్తు కోసం ప్రతిపాదన వచ్చేలా పైరవీలు సాగించారు. వీరితో పాటు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి సైతం పొత్తు కోసమే ప్రయత్నించారనే టాక్ నడిచింది. చంద్రబాబు మార్కు రాజకీయాలు అన్నీ తెలిసిన బీజేపీ అధిష్టానం పొత్తులపై ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం.

ఇదీ చదవండి: వల్లనోరిమామా నేనెళ్లను.. చీపురుపల్లి పోనంటున్న తమ్ముళ్లు 

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)