Breaking News

‘అమిత్ షానే కాదు.. ఏ షా వచ్చినా మాకేం కాదు.. అది డీఎంకే పవర్‌’

Published on Fri, 04/18/2025 - 21:17

చెన్నై:  ఇటీవల అన్నా డీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత డీఎంకే పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. గత వారం  అదొక ‘అవినీతి కూటమి’ అంటూ వ్యాఖ్యానించిన డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్..  వారి పొత్తుపై మరొకసారి ఘాటు వ్యాఖ్యాలు చేశారు. తమిళనాడుకొచ్చి బీజేపీ ఏదో చేద్దామని కలలు కంటుందని, అది వారి వల్ల కాదని స్టాలిన్ నేరుగా విమర్శలు చేశారు. తమిళనాడుకు అమిత్ షానే కాదు.. ఏ షా వచ్చినా  తమకేమీ కాదంటూ విమర్శించారు. 

అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకునే సందర్భంలో తమిళనాడుకు సంబంధించి ఏ ఒక్క విషయంలోనూ బీజేపీ పెద్దలు క్లారిటీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అవకతవకలు జరిగిన నీట్ ఎగ్జామ్స్ కు సంబంధించి రాష్ట్ర విద్యార్థులకు ఎటువంటి మినహాయింపును బీజేపీ ఇవ్వలేదన్నారు. అదే సమయంలో హిందీని తమిళనాడులో రుద్దమనే విషయంలో కూడా వారు  ఏమీ స్పష్టత ఇవ్వలేదని, ఇక డీలిమిటేషన్ అంశంపై కూడా ఏమీ పెదవి విప్పలేదని బీజేపీని కార్నర్ చేశారు స్టాలిన్‌.

తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి తమ ప్రభుత్వం పట్ల వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టిన విషయాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపు పెట్టులాంటి తీర్పని స్టాలిన్ వ్యాఖ్యానించారు. వ్యవస్థలను వ్యక్తులను అడ్డుపెట్టుకుని పెత్తనం చేయాలని ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. 

తాను  ఇక్కడ ఒక విషయం మాత్రం దేశ ప్రజలకు చెప్పదలుచుకున్నానని, తమ పోరాటం కేవలం తమిళనాడుకి, తమిళ ప్రజలకు సంబంధించినది మాత్రమే కాదని, యావత్ దేశ ప్రజల తరఫున చేస్తున్న పోరాటంగా స్టాలిన్ అభివర్ణించారు.  ఇది డీఎంకే బలమంటూ బీజేపీ, అన్నాడీఎంకేల పొత్తును దెప్పిపొడిచారు. అందుచేత తమిళనాడు  ఎవరు వచ్చినా తమను ఏం చేయలేరని స్టాలిన్ వ్యాఖ్యానించారు. 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)