Breaking News

కుల గణన: అఖిలేష్‌ విమర్శలకు అనురాగ్‌ ఠాకూర్‌ కౌంటర్‌

Published on Wed, 07/31/2024 - 13:49

ఢిల్లీ: లోక్‌సభలో కులగణనపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ చీఫ్‌, ఎంపీ అఖిలేష్‌ యాదవ్‌ చేసిన విమర్శలకు బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్ కౌంటర్‌ ఇచ్చారు.  అనురాగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలపై బుధవారం  అఖిలేష్‌ యాదవ్‌ స్పందిస్తూ..   ఇతరు కులాన్ని  ఎలా అడుగుతారు? అని మండిపడ్డారు. కులం గురించి అనుచిత  వ్యాఖ్యలు  చేయటం ఆమోదయోగ్యం కాదని విమర్శలు చేశారు.

తాజాగా అఖిలేష్‌  యాదవ్‌  విమర్శలను  బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ తిప్పికొట్టతారు.  ఈ మేరకు  ‘ఎక్స్‌’ వేదికగా  గతంలో  అఖిలేష్‌ మాట్లాడిన రెండు వీడియోలు పోస్ట్‌ చేసి  విమర్శలు చేశారు.  రెండు వీడియోల్లో ఒకటి.. ఓ జర్నలిస్ట్‌ను అఖిలేష్‌.. అతని కులం  ఏంటి? అని అడుగుతారు. మరో వీడియోలో లో​క్‌సభలో కులం  అంశంపై ప్రసంగిస్తారు. ఈ వీడియోలకు మీరు(అఖిలేష్‌ యాదవ్‌) ఎలా కులం గురించి అడుగుతారు? అని  అనురాగ్‌ ఠాకూర్‌ కామెంట్‌ చేశారు.

 

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బుధవారం సైతం లోక్‌సభలో గందరగోళం చోటు చేసుకుంది. అనురాగ్‌ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ నినాదాలు చేశారు. 

మోదీ సర్కారుపై విపక్షనేత రాహుల్‌గాంధీ చేసిన ‘చక్రవ్యూహం’వ్యాఖ్యలను మంగళవారం ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ తీవ్రంగా ఖండించారు. ‘తమది ఏ కులమో కూడా తెలియని వారు కులగణన కోరుతున్నారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర దుమారం రేపాయి. ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు.. రాహుల్‌ను ఉద్దేశించినవేనంటూ విపక్ష సభ్యులంతా మండిపడ్డారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)