Breaking News

అల్లర్లపై ఎన్నికల కమిషన్‌ సమాధానం చెప్పాలి

Published on Fri, 05/24/2024 - 06:20

సాక్షి,అమరావతి/నరసరావుపేట: మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్‌ సమాధానం చెప్పాలని నరసరావుపేట వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ అభ్యర్ధి అనిల్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్ని­కల కమిషన్‌ అల్లర్లపై ఎలాంటి చర్యలు తీసు­కోలే­దని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు సత్యహరి­శ్చంద్రులు అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. గురువారం ఆయన తన ప్రసంగంతో కూడిన వీడియోను విడుదల చేశారు. ఎన్నికల హింస, అల్లర్లపై ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గంలో అధికారు­లను మార్చిన తరువాతే దాడులు, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకు­న్నా­యన్నారు.

టీడీపీ అల్లర్లకు పాల్పడేందుకు అవ­కా­శాలున్నా­యని పిన్నెల్లి ముందు నుంచి ఈసీకి లేఖలు రాస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. మాచర్ల­లోని పలు ప్రాంతాల్లో  రిగ్గింగ్‌ జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీల­పై దాడులు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేసినా స్పందించలేదని ఆరోపించారు. టీడీపీ రిగ్గింగ్‌ చేస్తున్న చోట ఎస్పీ సహకారం అందించారని, టీడీపీ పాల్పడ్డ రిగ్గింగ్‌ పై ఎస్పీ స్పందించకపోతే స్వయంగా పిన్నెల్లి వెళ్లి అడ్డుకున్నారని గుర్తుచేశారు. పాల్వాయి గేట్‌ వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు తల పగులకొట్టినా పోలీసులు స్పందించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల రోజు తొమ్మిది ఈవీఎంలు ధ్వంసం అయితే  పిన్నె­ల్లి వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. 

పిన్నెల్లి వీడియో బయటకు ఎలా వచ్చిందనే దానిపై  కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఒక సామాజికవర్గం అధికారులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారని, కానీ టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయులు సుద్ధ పూసలాగా మాట్లాడు­తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.   తుమృకోటలో రిగ్గింగ్‌ జరుగుతోందని తానే  ఫోన్‌ చేసి ఎస్పీకి తెలియ­చేశానని, టీడీపీవాళ్లు దాడులు చేస్తున్నారని చెప్పినా స్పందించలేదన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామ­న్నారు. టీడీపీ రిగ్గింగ్‌ కు పాల్పడుతున్న ఒప్పి­చర్ల, తుమృకోట, పాల్వా­యి గేట్, చింత­పల్లిలో మాత్రం నామమాత్రంగా పోలీసులను నియ­మించారని ఆరోపించారు. ఈ గ్రామాల్లో పోలింగ్‌ బూత్‌ ల వీడియో ఫుటేజ్‌ బయట పెట్టాలని డి­మాం­డ్‌ చేశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)