Breaking News

జనసేనకు డిప్యూటీ స్పీకర్‌?

Published on Mon, 06/17/2024 - 04:48

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇప్ప టికే జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి లభించిన విషయం తెలిసిందే. 21 మంది ఎమ్మెల్యే లున్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వాలని జనసేన ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు అంగీకరించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేనకు మూడో వంతు పదవులు వస్తాయని పవన్‌కళ్యాణ్‌ చెప్పేవారు. 

ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్‌ పదవి లభించే అవకాశం ఉందని సమాచారం. ఈ పదవికి జనసేన పార్టీ నుంచి అవనిగడ్డ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్‌ పేర్లు వినిపిస్తున్నాయి. బుద్ధప్రసాద్‌ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి జనసేనలో చేరారు. బొలిశెట్టి తొలినుంచీ జనసేనలోనే ఉన్నారు. నిజంగా అవకాశం వస్తే వీరిద్దరిలో ఒకరు ఆ పదవిలో కూర్చోవడం ఖాయమని చెబుతున్నారు. 

మరోవైపు స్పీకర్‌ పదవికి టీడీపీ సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరును పరిశీలిస్తున్నారు. ఇదిలావుండగా ఈ నెల 19వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. తొలిరోజు  ప్రొటెం స్పీకర్‌తో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక నిర్వహిస్తారని సమాచారం.  

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)