Breaking News

Assam Clash: సంచలన ఆరోపణలకు దిగిన రాహుల్‌ గాంధీ

Published on Wed, 01/24/2024 - 10:57

గువాహటి: రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర దూకుడుతో.. అస్సాం(అసోం) రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. తాజాగా రాహుల్‌ మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. ఈ క్రమంలో  మరోమారు సంచలన ఆరోపణలే చేశారాయన. 

అసోంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ కీలక నేతలపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయినా ఆయన వెనక్కి తగ్గడం లేదు.  దేశంలోనే అత్యంత అవినీతిపరుడు హిమంత శర్మ అని బుధవారం ఉదయం రాహుల్‌ గాంధీ మరోసారి వ్యాఖ్యానించారు. అంతేకాదు అమిత్‌ షా గుప్పిట్లో శర్మ ఉండిపోయారని.. షానే ఆయన్ని వెనకుండి నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. 

ఇదీ చదవండి: రాహుల్‌కు ప్రమాదం పొంచి ఉంది.. షాకు ఖర్గే లేఖ

బుధవారం ఉదయం బారాపేటలో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. ‘‘ఆయన దేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి. ఈ విషయాన్నే నేను అన్నట్లు ఆయనకు మీరు(మీడియాను ఉద్దేశించి..) తెలియజేయండి. అసోం ముఖ్యమంత్రి అమిత్‌ షా నియంత్రణలో ఉన్నారు. షాకు గనుక వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే ఆయన్ని పార్టీలో నుంచి గెంటేస్తారు’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా.. అనుకున్న మార్గంలోనే జోడో న్యాయ్‌ యాత్ర ముందుకు సాగుతుందని స్పస్టం చేశారాయన. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)