Breaking News

గంటా శ్రీనివాస్‌ దారెటో తేలిది ఇవాళే!

Published on Thu, 03/14/2024 - 08:38

సాక్షి, విశాఖపట్నం: మాజీ మం‍త్రి గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడతారా?.. లేదంటే అయిష్టంగానే ఆ పార్టీలో కొనసాగుతారా? తన రాజకీయ భవిష్యత్తు కోసం గంటా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ చర్చే ప్రధానంగా నడుస్తోంది. చీపురుపల్లిలో పోటీ తన వల్ల కాదని గంటా చెబుతున్నా.. చంద్రబాబు మాత్రం పోటీ చేయాల్సిందేనని తేల్చేశారు. దీంతో ఆయన ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘‘మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేసేందుకు నన్ను సరైన అభ్యర్థిగా పార్టీ భావించింది. చీపురుపల్లిలో సీనియర్‌ లీడర్‌పై పోటీ చేస్తే బాగుంటుందని గట్టి ప్రతిపాదన పెట్టింది’’.. ఫిబ్రవరి 23వ తేదీ ప్రెస్‌మీట్‌లో గంటా శ్రీనివాసరావు చెప్పిన మాట. అయితే వెంటనే ఆయన వెనకడుగేశారు. చీపురుపల్లిలో అవకాశాలపై తన సహచరులు, స్నేహితులు, పార్టీ కార్యకర్తలతో చర్చిస్తున్నానని చెబుతూనే.. అక్కడ నుంచి పోటీకి విముఖత ప్రదర్శిస్తూ వచ్చారు. 

‘ప్రతి ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న మాట వాస్తవమే. కానీ, ఈసారి గెలిచిన చోట నుంచే మళ్లీ పోటీ చేయాలనుకున్నా’  ఇది మారిన గంటా స్వరం. ఈ క్రమంలో పదే పదే చంద్రబాబును కలుస్తూ.. తాను చీపురుపల్లిలో అదీ బొత్స లాంటి పవర్‌ఫుల్‌ లీడర్‌పై పోటీకి సిద్ధంగా లేనని, కాదని బలవంతంగా పోటీకి దించితే ఫలితం మరోలా ఉండొచ్చని మొరపెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు కనికరించడం లేదు. పోటీ చేస్తే చీపురుపల్లి నుంచే చేయాలని.. లేకుంటే మీ దారి మీరు చూస్కోండంటూ చంద్రబాబు తేల్చేసినట్లు సమాచారం. తాజాగా బుధవారం కూడా ఆయన​ చంద్రబాబును కలిసినా.. అదే సమాధానం వచ్చింది.దీంతో.. 

గంటా శ్రీనివాస్‌ ఇవాళ తన రాజకీయ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి.  ముఖ్య అనుచరులతో గురువారం గంటా తన నివాసంలో భేటీ కానున్నారు. వాళ్లతో చర్చించి తన తర్వాతి అడుగులపై కీలక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)