Breaking News

అన్ని నామినేషన్లు పూర్తి.. ఇక యుద్ధానికి సిద్ధం: కాం‍గ్రెస్‌

Published on Wed, 10/30/2024 - 13:46

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియడంతో ఏయే స్థానాల్లో ఏ అభ్యర్థి పోటీ చేస్తున్నారనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. దీంతో బరిలో నిలిచన అభ్యర్థులు ప్రచార హోరును పెంచుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ తమ అభ్యర్థుల గెలుపుకు సర్వశక్తుల కృషిచేస్తున్నాయి.

అయితే నామినేషన్ల గడువు ముగిసినప్పటికీ..15  స్థానాల్లో అటు మహాయుతి, ఇటు మహా వికాస్‌ అఘాడీ కూటమిలోనూ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో తొలుత గందరగోళం నెలకొంది. ఇప్పుడు ఆ సందిగ్దత తొలగిపోయింది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకు నామినేషన్లు పూర్తి చేసినట్లు మహా వికాస్‌ అఘాడీ కూటమి వెల్లడించింది. ఇక ఎన్నికల యుద్ధానికి సిద్దమైనట్లు ప్రకటించింది. ఈ మేరకు  రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోలే, సీనియర్‌ నాయకుడు వర్షా గైక్వాడ్‌, నసీమ్‌ ఖాన్‌లతో కలిసి మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి 

రమేష్ చెన్నితాల బుధవారం మాట్లాడుతూ..మహా వికాస్ అఘాడిలో అన్ని పార్టీలకు సమానమైన గౌరవం ఉందని తెలిపారు.   మొత్తం 288 స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశామని చెప్పారు. మహాయుతి కూటమితో పోల్చితే తమ  గ్రూపులో ఎలాంటి గొడవలు లేవని అన్నారు. . తమ సభ్యుల మధ్య కొంత అపార్థాలు ఉన్నప్పటికీ మిత్రపక్షాల మధ్య ఎలాంటి చీలికలు లేవన్నారు. ఎంవీయేలో అన్ని పార్టీలకు సమానమైన గౌరవాన్ని అందించామని తెలిపారు

‘మహాయుతి సమయం ముగిసింది. , ఆ కూటమిలో బీజేపీ తమ మిత్రపక్షాలైన ఎన్సీపీ, శివసేన(షిండే) స్థానాలను దోచుకుంది. బీజేపీ తమ కూటమి భాగస్వాములను అణగదొక్కాలని చూస్తోంది. కానే మేము ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులకు ఏ, బీ ఫారమ్‌లను ఇచ్చాం. ఎన్నికల్లో పోటీకి మేము సిద్దం. స్వతంత్రంగా నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ నాయకులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలి. ’ అని చెన్నితాల కోరారు. కాగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. 23న ఫలితాలను వెల్లడిస్తారు. 
 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)