Breaking News

ఇండియా కూటమి ఉంటుందా? అఖిలేశ్‌ కీలక ట్వీట్‌

Published on Sun, 01/28/2024 - 07:40

లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి మనుగడపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యూపీలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సమాజ్‌వాదీపార్టీ(ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో చేసిన ఒక పోస్టు ఇందుకు కారణమవుతోంది. 

‘ఇండియా కూటమిలో భాగంగా ఎస్పీ, కాంగ్రెస్‌ మధ్య పొత్తుకు మంచి ప్రారంభం లభించింది. యూపీలో 11 బలమైన సీట్లను కాంగ్రెస్‌కు ఇస్తున్నాం‘ అని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. అయితే ఈ పోస్టు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. నిజానికి కాంగ్రెస్‌ సమాజ్‌వాదీ పార్టీని యూపీలో అడిగింది 13 సీట్లు.

దీనికి అఖిలేశ్‌ ఒప్పుకోవడం లేదని, కాంగ్రెస్‌కు కేవలం 11 సీట్లే ఆయన ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఒకవేళ 13 సీట్ల కోసం కాంగ్రెస్‌ పట్టుపడితే పొత్తు వ్యవహారంలో మొదటికే మోసం వస్తుందన్న ప్రచారం జరుగుతుండటం గమనార్హం.  

అఖిలేశ్‌ పోస్టుపై యూపీ కాంగ్రెస్‌ వ్యవహరాల ఇంఛార్జ్‌ అవినాష్‌ పాండే స్పందించారు. ‘సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల పంపకంలో చర్చల్లో మంచి పురోగతి ఉంది. ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ పోస్టు తాను కూడా చూశానని అయితే ఆయన వ్యాఖ్యలపై మరింత సమాచారం ఏదీ లేదు’అని పాండే అన్నారు. 

కాగా, బిహార్‌ లాంటి కీలక రాషష్ట్రంలో జేడీయూ చీఫ్‌ నితీశ్‌కుమార్‌ ఇప్పటికే ఇండియా కూటమిని వీడుతున్నట్లు స్పష్టమైపోయింది. ఆయన బీజేపీతో మళ్లీ జతకట్టి  కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఇక పశ్చి‍మ బెంగాల్‌లో మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్‌తో లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుపై ఎటూ తేల్చలేదు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల వరకు ఇండియా కూటమిలో ఎన్ని పెద్ద పార్టీలు మిగులుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.  

ఇదీచదవండి.. తొమ్మిదోసారి నితీశ్‌ ప్రమాణస్వీకారం నేడే 

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)