Breaking News

మహారాష్ట్ర రాజకీయం.. అజిత్‌ కుమారుడికి బంపరాఫర్‌!

Published on Sat, 01/31/2026 - 10:15

ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ అకాల మరణం తర్వాత మరాఠా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు. నేడు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు.. అజిత్‌ కుమారుడు పార్థ్‌ పవార్‌కు బంపరాఫర్‌ వస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అజిత్‌ పవార్‌ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల గురించి రోజుకో విషయం బయటకొస్తుంది. తాజాగా ఆయన పెద్ద కుమారుడు పార్థ్‌ పవార్‌ రాజ్యసభలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన తల్లి సునేత్రా పవర్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఆమె స్థానంలో రాజ్యసభకు వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, పార్థ్‌ పవార్‌.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మావల్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.

ఇదిలా ఉండగా.. అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఆయన స్థానాన్ని సతీమణి సునేత్ర పవార్‌కు అప్పగించాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఇతర కూటమి నేతలు సునేత్ర పవార్‌తో చర్చలు జరిపారు. ఆ చర్చలు విజయవంతం కావడంతో ఆమె ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సునేత్ర పవార్ గతంలో బారామతి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ ఆమెకు స్థానికంగా మంచి పట్టుంది. అజిత్ పవార్ వర్గం ఆమెను ఉప ముఖ్యమంత్రిగా తీసుకురావడం ద్వారా మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, బారామతి ప్రాంతంలో తమ బలాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. ఇక, సునేత్రా నిర్ణయంతో అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్‌సీలోని రెండు వర్గాలు ఏకమవుతాయన్న ప్రచారానికి తెర పడినట్లయింది.

సునేత్ర రికార్డు
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మహిళ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టటడం ఇదే తొలి సారి. 1978వ సంవత్సరంలో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ప్రారంభమైనప్పుడు ఈ పదవిని సృష్టించారు. అయితే ఇప్పటి వరకు ఏ మహిళా నాయకురాలు కూడా ఈ హోదాలో పని చేయలేదు. అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని ఎన్సీపీ నాయకులు గట్టిగా కోరడంతో సునేత్రా పవార్ ఇందుకు అంగీకరించారు. శనివారం ఉదయం ముంబైలో జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమెను ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం సాయంత్రం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)