Breaking News

‘దేశంలో మోదీకి ప్రత్యామ్నయ నేత ఎవరూ లేరు’

Published on Mon, 12/25/2023 - 13:32

ముంబై: ప్రస్తుతానికి దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తప్ప మరో ప్రత్యామ్నయ నేత ఎవరూ లేరని మహారాష్ట్ర డిప్యూటీ అజిత్‌ పవార్‌ అన్నారు. వచ్చే 2024 సార్వత్రిక పార్లమెంట్‌ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంపై సందేహాలు వస్తున్నాయన్న ప్రశ్నకు సమాధానంగా మాట్లాడారు.  

‘ప్రస్తుతానికి  దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తప్ప మరో ప్రత్యామ్నయ నాయకుడు ఎవరూ లేరు. అటువంటి నిర్ణయం తీసుకోవాలంటే చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకటి, రెండు విషయాలను దృష్టి పెట్టుకొని బీజేపీ అదిష్టానం నిర్ణయం తీసుకోదు’ అని ఆయన అన్నారు.

మీరే చాలా వరకు ఈ విషయంపై ప్రచారం కల్పిస్తున్నారని మీడియా ఉద్దేశించి అన్నారు. అయితే దేశంలో ఎవరి పాలన సురక్షితం, భద్రంగా, దృఢంగా ఉంటుందో. ఎవరు ప్రపంచ వేదికలపై మన దేశ గుర్తింపును పెంచుతారో అదే చాలా ముఖ్యమని అన్నారు. అయితే తాము ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల ఫలితాలు చూశామని తెలిపారు. అంచనాలకు తగినట్టు ఫలితాలు రావని అన్నారు. కానీ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందని గుర్తుచేశారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)