Breaking News

మోదీ కేబినెట్.. సహాయ మంత్రి పదవిపై శివ‌సేన అసంతృప్తి

Published on Mon, 06/10/2024 - 17:48

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ సహా 72 మందితో కేంద్ర క్యాబినెట్‌ కూడా ఏర్పాటైంది. వీరిలో 30 మంది కేబినెట్‌ మంత్రులు,36 మంది సహాయ మంత్రులు, 5 మంది స్వంతంత్ర్య  మంత్రులు దక్కాయి.

ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, జేడీఎస్​, శివసేన, ఎన్సీపీ, ఎల్జీపీ, ఆరెల్డీ పార్టీల నుంచి నేతలకు పలు మంత్రి పదవులు వరించాయి.

అయితే మోదీ కేబినెట్​  కూర్పుపై మిత్రపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వంలో స్వతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మంత్రిత్వ పదవి దక్కడంపై ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సోమవారం అసంతృప్తిని వ్యక్తం చేసింది. శివసేన పార్టీ కేబినెట్ మంత్రి ఆశిస్తున్నట్లు పేర్కొంది.  

ఈ మేరకు ఎన్డీయే ఇత‌ర భాగ‌స్వామ్య ప‌క్షాల‌కు ద‌క్కిన ప‌ద‌వుల‌ను ప్ర‌స్తావిస్తూ శివసేన చీప్ విప్ శ్రీరంగ్ బ‌ర్నే మాట్లాడుతూ.. ఐదుగురు ఎంపీలు క‌లిగిన చిరాగ్ పాశ్వాన్‌, ఒక ఎంపీ క‌లిగిన జిత‌న్ రాం మాంఝీ, ఇద్ద‌రు ఎంపీలు క‌లిగిన జేడీఎస్‌ల‌కు ఒక్కో క్యాబినెట్ మంత్రి ప‌ద‌విని కేటాయించార‌ని.. త‌మ‌ను మాత్రం ఒకే ఒక్క స‌హాయ మంత్రి ప‌ద‌వికి ప‌రిమితం చేశార‌ని వాపోయారు.

ఏడు ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్క పదవి మాత్రమే ఎందుకు లభించిందని ప్రశ్నించారు. తమకు కేబినెట్​ మంత్రిత్వ శాఖ వచ్చి ఉండాల్సిందని తెలిపారు. కాగా శివసేన నుంచి ప్రతాప్​ రావ్​ జాదవ్​కు స్వతంత్ర హోదా కలిగిన కేంద్ర పదవి దక్కింది. మరోవైపు ఎన్సీపీ అజిత్ ప‌వార్ వ‌ర్గం సైతం త‌మ‌కు స‌హాయ మంత్రి ప‌ద‌వితో స‌రిపెట్ట‌డంపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన విషయం తెలిసిందే. తమకు కూడా కేబినెట్ మంత్రి కావాలని డిమాండ్ చేసింది. ఆదివారం ప్రమాణస్వీకారానికి ముందు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర హోదా మంత్రి ప్రతిపాదనను తిరస్కరించింది.

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)