Breaking News

ఆదిలాబాద్‌ రాజ‌కీయ చ‌రిత్ర : గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Published on Wed, 07/26/2023 - 12:11

ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో జోగు రామన్న మరోసారి టిఆర్‌ఎస్‌ పక్షాన పోటీచేసి విజయం సాదించారు. దీంతో ఆయన నాలుగుసార్లు గెలిచినట్లయింది. ఒకసారి టిడిపి తరపున, మూడుసార్లు టిఆర్‌ఎస్‌ పక్షాన గెలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ క్యాబినెట్‌లో 2014లో తర్వాత మంత్రిగా ఉన్న జోగు రామన్నకు 2018లో గెలిచిన తర్వాత మంత్రి పదవి దక్కలేదు. 

జోగు రామన్న తన సమీప బిజెపి ప్రత్యర్ది పాయల్‌ శంకర్‌పై 26606 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్‌ ఐ పార్టీ మూడో స్థానానికి పరిమితం అయింది. రామన్నకు 74050 ఓట్లు రాగా, శంకర్‌కు 47444 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ ఐ అభ్యర్ది గండ్ర సుజాతకు 32200 ఓట్లు వచ్చాయి. జోగు రామన్న బిసి వర్గానికి చెందినవారు. ఆయన మున్నూరు కాపు సామాజికవర్గం వారు.

2009లో జోగు రామన్న  టిడిపి తరపున పోటీచేసి విజయం సాధించగా, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న నేపధ్యంలో టిఆర్‌ఎస్‌లో చేరి పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో ఘన విజయం సాదించారు. తదుపరి 2014, 2018లలో  గెలిచారు.  ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో ఆరుసార్లు రెడ్లి సామాజికవర్గ నేతలు, ఐదుసార్లు బిసి నేతలు, రెండుసార్లు బ్రాహ్మణ, ముగ్గురు ఇతర వర్గాల నేతలు ఎన్నికయ్యారు.

రామచంద్రారెడ్డి ఆదిలాబాదులో 1978, 85లలో ఇండిపెండెంటుగాను, 1989, 2004లలో కాంగ్రెస్‌ ఐ తరుఫున మొత్తం నాలుగుసార్లు గెలిచారు. ఈయన నేదురుమల్లి, కోట్ల క్యాబినెట్‌లలో మంత్రిగా కూడా పనిచేసారు. ఇక్కడ 1999లో గెలిచిన పడాల భూమన్న చంద్రబాబు క్యాబినెట్‌లో స్థానం పొందారు.  ఆదిలాబాదులో పిడిఎఫ్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐలు మూడుసార్లు, టిడిపి మూడుసార్లు, టిఆర్‌ఎస్‌ రెండుసార్లు సిపిఐ ఒకసారి గెలవగా, నాలుగుసార్లు ఇండి పెండెంట్లు విజయం సాధించారు. మరో నేత సి.వామన్‌రెడ్డి ఒకసారి ఇండ పిెండెంటుగా, ఇంకోసారి టిడిపి పక్షాన గెలిచారు.

ఆదిలాబాద్‌లో గెలిచిన‌.. ఓడిన అభ్య‌ర్థులు వీరే..

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)