Breaking News

పవన్‌.. జనసైనికుల పరిస్థితేంటి: అడపా శేషు

Published on Mon, 07/10/2023 - 17:49

సాక్షి, తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అడపా శేషు ఫైరయ్యారు. ఏపీ ప్రజల పట్ల పవన్‌కు ఘోరమైన అభిప్రాయముంది.. నిన్నటి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. చంద్రబాబును సీఎం చేయడమే పవన్‌ లక్ష్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

కాగా, అడపా శేషు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏలూరు సభలో ఏపీ ప్రజలు తనను నమ్మరనే అభిప్రాయానికి పవన్‌ వచ్చేశాడు. మహిళల పట్ల పవన్‌ చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. వాలంటరీ వ్యవస్థ వైపు ప్రపంచమంతా చూస్తోంది. 30వేల మంది మహిళలు కనిపించడం లేదంటున్న పవన్‌కు కళ్లుపోయాయా?. చంద్రబాబు సమయంలో మహిళలపై జరిగిన అకృత్యాలు పవన్‌కు కనిపించలేదా?. పవన్‌, బాబు, లోకేష్‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో చూస్తేనే పవన్‌ భయపడిపోతున్నాడు. సీఎం జగన్‌ను ఏకవచనంతో పిలుస్తావా?. పవన్‌ ఇష్టానుసారం మాట్లాడితే ఇక్కడెవరూ చూస్తూ ఊరుకోరు. 

పవన్‌ కల్యాణ్‌ ఎప్పటికీ నటుడే.. రాజకీయ నాయకుడు కాలేడు. పవన్‌ కేవలం ఏపీకి వచ్చి నటించి పోయేవాడే. నువ్వొక్కడివే కమ్మగా ఉంటే సరిపోతుందా పవన్‌.. నిన్ను నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి?. పవన్‌ తక్షణమే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే పవన్‌ను తిరగనివ్వం. చంద్రబాబు నాటకంలో పవన్‌ కేవలం పాత్రధారే. జనసైనికుల్లారా జాగ్రత్తగా ఉండండి.. పవన్‌ను నమ్మి మోసపోకండి అంటూ హితవు పలికారు. 

ఇది కూడా చదవండి: పవన్‌కు పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటర్‌

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)