Breaking News

మోదీపై అభిషేక్‌ బెనర్జీ విమర్శలు

Published on Sun, 01/18/2026 - 20:16

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

అసెంబ్లీ ఎన్నికల తరుణంలో టీఎంసీ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. రాష్ట్రాలకు రావాల్సిన నిధులను కేంద్రం అడ్డుకుంటోందని, బీజేపీ రాష్ట్ర ప్రజలపై కష్టాలు మోపుతోందని అన్నారు. నిధుల నిలిపివేత వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.

కేంద్రం గ్రామీణ అభివృద్ధి, పథకాలు, మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన నిధులను విడుదల చేయడం లేదు. దీని వల్ల పేదలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రజలపై నేరుగా దాడి చేసినట్టే. బెంగాల్ ప్రజలు బీజేపీని తిరస్కరించారు. అందుకే కేంద్రం ప్రతీకారంగా నిధులను నిలిపివేస్తోంది’ అని ఆరోపించారు. 

ఈ వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. తృణమూల్ కాంగ్రెస్ కేంద్రంపై ఒత్తిడి పెంచుతుండగా, బీజేపీ మాత్రం నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయి. అందుకే విడుదల నిలిపివేశాం  అని వాదిస్తోంది. ఈ వివాదం రాబోయే ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి, పశ్చిమ బెంగాల్‌కు నిధుల నిలిపివేతపై అభిషేక్ బెనర్జీ చేసిన ఆరోపణలు రాష్ట్ర కేంద్ర సంబంధాలను మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)