Breaking News

బీజేపీ గెలుపు కాదు.. కాంగ్రెస్ ఓటమి: ఆప్‌ సెటైర్లు

Published on Wed, 10/09/2024 - 21:12

ఢిల్లీ:  హర్యానా అసెంబ్లీ ఎ​‍న్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్‌ పోల్స్‌ను తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్‌ గెలుపు సొంతం చేసుకుంది. అయితే.. హర్యానా ఫలితాలపై ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దా  ఓ జాతీయ మీడియాతో  మాట్లాడుతూ.. సెటైర్లు వేశారు. హర్యానాలో బీజేపీ గెలుపును అంగీకరించలేనని అన్నారు. బీజేపీ విజయం అనటం కంటే.. కాంగ్రెస్‌ ఓటమే అధికమని అన్నారు. అధికార బీజేపీ పార్టీకి 39 శాతం ఓట్ల వస్తే.. 61 శాతం ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయని గుర్తు చేశారు.

‘‘ఎ‍న్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ బీజేపీకి వస్తే నేను ఆ పార్టీ విజయాన్ని అంగీకరించేవాడిని. కానీ, అలా జరగలేదు. హర్యానాలో ఓట్లు బీజేపీకి గెలుపు కోసం పడలేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయి. 39 శాతం  ఓట్లు బీజేపీకి పడ్డాయి. అదే బీజేపీకి 61 శాతం వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు. ఇది బీజేపీ గెలుపు కాదు.. కాంగ్రెస్ ఓటమి’’ అని అన్నారు. 

మరోవైపు.. జమ్ము కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి కాంగ్రెస్‌ ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగిందని, అందుకే బీజేపీని ఓడించగలిగిందని అన్నారు. ‘‘ జమ్ము కశ్మీర్‌లో ఇండియా కూటమి ఒక యూనిట్‌గా పోరాటం చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి కూటమిగా బరిలో దిగటంతో బీజేపీ ఓడిపోయింది. కానీ, హర్యానాలో దురదృష్టవశాత్తు.. ఇండియా కూటమి పార్టీలు ఒంటరిగా బరిలో దిగటంతో ఫలితం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వచ్చింది’’ అని అన్నారు.

చదవండి:  బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)