Breaking News

శవ రాజకీయాల కోసమే టీడీపీ విధ్వంసకాండ

Published on Fri, 08/25/2023 - 04:00

మదనపల్లె: పోలీసులను రెచ్చగొట్టి, కాల్పులకు ప్రేరేపించి, ఆ కాల్పుల్లో పదుల సంఖ్యలో అమాయక టీడీపీ కార్యకర్తలు చనిపోతే వారి శవాలతో కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పరేడ్‌ నిర్వహించి రాజకీయంగా లబ్ధి పొందే వ్యూహంతోనే అంగళ్లు, పుంగనూరుల్లో టీడీపీ నాయ­కులు విధ్వంసకాండకు పాల్పడ్డారని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పారు. అంగళ్లు, పుంగనూరు విధ్వంసకాండలో అరెస్టయిన 120 మంది టీడీపీ నాయకుల బెయిల్‌ పిటిషన్లపై గురువారం మదనపల్లె రెండో ఏడీజే కోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ సుధాకర్‌రెడ్డి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దుష్యంత్‌రెడ్డి, ఏపీపీలు రామకృష్ణ, జనార్ధనరెడ్డి, చంద్రకుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు.

ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు వాదనలు కొనసా­గాయి. పుంగనూరు, అంగళ్లులో విధ్వంసాన్ని, టీడీపీ అధినేత చంద్రబాబు పిచ్చలవాండ్లపల్లె ప్రాజెక్టు ఆయకట్టు రైతులపైకి టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టిన వీడియోలను న్యాయమూర్తి అబ్ర­హాంకు ఏఏజీ సుధాకర్‌రెడ్డి చూపించారు. ఆగస్టు 4న చంద్రబాబు ములకల­చెరువు హెచ్‌ఎన్‌­ఎస్‌ఎస్‌ కెనాల్‌ను పరిశీలించి అంగళ్లు, మదనపల్లె, పుంగనూరు బైపాస్‌ మీదుగా చిత్తూరు వెళ్లేందుకు డీజీపీ నుంచి అనుమతి తీసుకున్నారన్నారు.

తంబళ్లపల్లె నియోజకవర్గం పిచ్చలవాండ్లపల్లె ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు ఎన్జీటీ కోర్టులో స్టే తేవడంపై నిరసన తెలిపేందుకు ఆయకట్టు రైతులు నల్లబ్యాడ్జీలు ధరించి అంగళ్లుకు రాగా, వారిని చూసిన చంద్రబాబు ‘కొట్టండి.. చంపండంటూ’ టీడీపీ శ్రేణు­లను రెచ్చగొట్టినందుకే అల్లర్లు చెలరేగా­యన్నారు. అంగళ్లులో మొదలైన విధ్వంసకాండ 30 కిలోమీటర్ల మేర కొనసాగి పుంగనూరులో పరాకాష్టకు చేరిందన్నారు. పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి 5,000 మంది కార్యకర్తలతో చంద్రబాబును పట్టణంలోకి తీసు­కెళ్లేం­దుకు ప్రయత్నించారని చెప్పారు.

బాబు పర్యటనలో పట్టణం లేదని, బైపాస్‌ వరకే ఉందని పోలీసులు అడ్డుకొన్నారని, వెంటనే టీడీపీ శ్రేణులు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై విచక్షణారహితంగా దాడిచేసి, విధ్వంసం సృష్టించారన్నారు. ఈ ఘటనలో 47 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని, మహిళా ఎస్‌ఐ కాలు విరిగిందని, ఓ కానిస్టేబుల్‌ కన్ను కోల్పోయారని తెలిపారు. ఎస్పీలు రిశాంత్‌రెడ్డి, గంగాధరరావు సంయమనం పాటించి కాల్పులు జరపకపోవ­డంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు.

కాల్పు­లు జరిగి కార్యకర్తలు చనిపోతే శవ రాజకీ­యాలు చేసి, శాంతిభద్రతలు క్షీణించాయంటూ రాష్ట్రపతి పాలన కోరాలన్నదే టీడీపీ నేతల వ్యూహమని చెప్పారు. ఇందులో ప్రైవేటు వ్యక్తులు సాక్షులుగా ఉన్నారని, అరెస్ట్‌ చేయా­ల్సిన వారు ఇంకా పరారీలో ఉన్న కారణంగా బెయిల్‌ ఇస్తే కేసును ప్రభావితం చేస్తారని, సమా­జంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని చెప్పారు. పోలీసులపై దాడులు చేసి చట్టంలోని సెక్షన్‌ 438 ద్వారా బెయిల్‌ తీసుకోవచ్చనే ధైర్యం నిందితులకు ఉందన్నారు.

బెయిల్‌ మంజూరు చేస్తే చట్టం ఏమీ చేయలేదనే సందేశం సమాజంలోకి వెళ్లి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం తరపున కాకుండా ఓ సాధారణ పౌరుడిగా సమాజశ్రేయస్సు, భద్ర­తను కాంక్షించి బెయిల్‌ నిరాకరించాల్సిందిగా కోరా­మన్నారు. నిందితుల తరపున హైకోర్టు న్యా­య­వాదులు హరిబాబు, కోటేశ్వర­రావు తదితరు­లు వా­దనలు వినిపించారు. ఇరు­పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు.

బాబు అధికారంలోకి రావాలనే ఈ కుట్రంతా
అనంతరం డీఎస్పీ కార్యాలయంలో ఏఏజీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చి అధికారంలోకి రావాలనుకుంటు­న్నారని వ్యాఖ్యానించారు. గతంలో ప్రభు­త్వాన్ని నడిపిన వ్యక్తి సమాజంలో అల్లక­ల్లోలం సృష్టించి, శాంతిభద్రతలకు విఘా­తం కలిగించి, క్షీణించాయని ఎలా ఫిర్యా­దు చేస్తారని ప్రశ్నించారు.

ప్రజలను భయò­³ట్టి అధికారంలోకి వచ్చిన దాఖ­లాలు ఎక్కడా లేవన్నారు. చట్టం ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి సమాజాన్ని నెట్ట­వద్దని అన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ కేశప్ప, సీఐలు సత్యనారాయణ, శివాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)