Breaking News

17న పరేడ్‌ గ్రౌండ్స్‌లోవిమోచన దినోత్సవం

Published on Wed, 09/06/2023 - 03:42

సాక్షి, హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని రాష్ట్రంలో జరుపుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత సర్కార్‌తో పాటు గత ప్రభుత్వాలు విమోచన దినోత్స వాలు అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి.. మజ్లిస్‌ పార్టీని సంతృప్తి పరిచేందుకు ఈ కార్యక్రమాన్ని విస్మరించాయని విమర్శించారు.

అయితే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గతేడాది సెప్టెంబర్‌ 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో అధికారికంగా విమోచన ఉత్సవాలు నిర్వహించామని, ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజర య్యారని గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా పరేడ్‌ గ్రౌండ్స్‌లోనే కేంద్రం తరఫున ఈ కార్యక్రమా లు నిర్వహించనున్నట్టు తెలిపారు.

మంగళవారం ఆయన ‘మేరీ మాటీ మేరా దేశ్‌’లో భాగంగా ‘మనమట్టికి నమస్సు లు, మన వీరులకు వందనం’ నినాదంతో స్వాతంత్య్ర సమరయోధులు, దేశం కోసం త్యాగాలు చేసిన వారి స్మరణకు చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమా లను గురించి వివరించారు. దేశవ్యాప్తంగా ప్రజలను మరోసారి ఏకతాటి పైకి తెచ్చేందుకు ‘నేను పుట్టిన నేల, నన్ను కన్న దేశం’ పేరుతో సెప్టెంబర్‌ 1న కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. గ్రామస్తులంతా ఇంటినుంచి పిడి కెడు మట్టి కానీ, పిడికెడు బియ్యాన్ని కానీ కలశంలో సేకరించేలా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 

7,500 కలశాల ద్వారా ఢిల్లీకి మట్టి
ఈ నెలలో అన్ని గ్రామాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి, మండల కేంద్రాల్లో దాన్ని గౌరవించి, తర్వాత జిల్లా కేంద్రానికి, అక్కడి నుంచి రాష్ట్ర రాజధానికి చేర్చడం జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. చివర్లో ఢిల్లీలోని అమృత్‌ పార్క్‌ (అమృత వనం)లో 75 వేల మొక్కలు నాటి సుమారు 7,500 కలశాల ద్వారా తెచ్చిన మట్టిని కర్తవ్యపథ్‌లోని వార్‌ మెమోరియల్‌ పక్కనున్న స్థలంలో పెడతామని, అక్కడ అమరవీరుల స్మారక వనాన్ని ఏర్పాటు చేస్తామని కిషన్‌రెడ్డి వివరించారు. 

భూములు లాక్కొనేందుకే ధరణి
ఇబ్రహీంపట్నం రూరల్‌: రైతులు, అమాయకుల నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులు భూములు లాక్కొనేందుకే ధరణి ఉపయోగపడుతోందని, దీనివల్ల రైతులకు ఒరిగిందేమీ లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో మంగళవారం నిర్వహించిన బీజేపీ రైతు మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరణి.. బీఆర్‌ఎస్‌కు భరణిగా మారిందని ఎద్దేవా చేశారు.

రైతును రాజును చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న 7 వేల మంది రైతుల కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.  సమావేశంలో కిసాన్‌ మోర్చా జాతీయ అధ్యక్షుడు శంభూజీ కుమార్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)