Breaking News

దుబాయ్‌కి డ్రైవర్లు కావలెను.. జీతం ఎంతంటే?

Published on Tue, 08/05/2025 - 14:20

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సమయంలో డ్రైవర్లు స్వదేశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌.. డ్రైవర్లు వంటి అసంఘటిత రంగ కార్మికుల కొరతతో విలవిల్లాడుతోంది. దీంతో భారత్‌కు వచ్చేసిన డ్రైవర్లను ఆకర్షించేందుకు యూఏఈ కంపెనీలు ముందుకొస్తున్నాయి. దీనికోసం జలంధర్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నియామక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. దుబాయ్‌కి చెందిన త్రీస్టార్‌ గ్రూపు, వియోలీయ, అల్లయ్‌డ్‌ ట్రాన్స్‌పోర్టు, దుబాయ్‌పోర్ట్‌ వంటి సంస్థలు డ్రైవర్ల నియామకం కోసం 10, 30వ తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో గణేష్‌కుమార్‌ తెలిపారు.

కడప, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో దుబాయ్‌ (Dubai) నుంచి తిరిగి వచ్చిన అనుభవజ్ఞులైన డ్రైవర్లు (Drivers) అత్యధికంగా ఉన్నారని, వారిని గుర్తించి అక్కడ దేశాల్లో ఉపాధి  కల్పించేలా స్థానిక అధికారులు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి యూఏఈ హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారికి ట్రైలర్, ట్రక్, ఐటీవీ డ్రైవర్లుగా అవకాశాలు కల్పించనున్నారు. 24 నుంచి 48 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులని, నెలకు రూ.35,000 నుంచి రూ.94,000 వరకు జీతం లభిస్తుందని ఏపీఎస్‌ఎస్‌డీసీ తెలిపింది. డ్రైవింగ్‌ టెస్ట్, టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆగస్టు 10న స్టార్‌ గ్రూపు, వియోలీయ, అల్లయ్‌డ్‌ ట్రాన్స్‌పోర్టు ఉద్యోగాలకు ఆగస్టు 30న ఐటీవీ డ్రైవర్లకు ఇంటర్వ్యూలు (Interviews) నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏపీఎస్‌ఎస్‌డీసీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు. లేదా skillinternational@apssdc.in ఈమెయిల్, 91–99888533 35, 8712655686, 8790118349, 8790117279 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరింది.

చ‌ద‌వండి: స్కూల్‌లో కూలి ప‌నులు చేయిస్తున్నారు

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)