Breaking News

అలస్కాలో ‘గుంటూరు విద్యార్థి’ అదృశ్యం

Published on Fri, 01/09/2026 - 13:06

అలాస్కా: అమెరికాలోని అలాస్కాకు ఒంటరిగా బయలుదేరిన ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. ప్రకృతి అందాలను తిలకించడానికి వెళ్లి.. మంచు కొండల మధ్య ఆచూకీ లేకుండా పోయాడు. గుంటూరు జిల్లా అద్దంకికి చెందిన హరి కరసాని హ్యూస్టన్‌లో నివాసం ఉంటున్నారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో హరి డిసెంబర్ 22, 2025న ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు.

అక్కడ హీలీ పట్టణంలోని ఔరోరా డెనాలి లాడ్జ్‌లో బస చేశారు  జనవరి 4 నాటికి తిరిగి వస్తానని తన రూమ్‌మేట్స్‌కు కూడా సమాచారం ఇచ్చారు. అయితే, డిసెంబర్ 30న చివరిసారిగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన హరి.. ఆ మరుసటి రోజు డిసెంబర్ 31 హోటల్ నుంచి చెక్-ఔట్‌ కాగా.. అప్పటి నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.

డిసెంబర్ 31న ఆయన హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక క్యాబ్ సర్వీస్ వాడినట్లు సమాచారం. హరికి డ్రైవింగ్ రాకపోవడంతో ఆయన క్యాబ్‌లు, స్థానిక రవాణాపైనే ఆధారపడ్డారు. హోటల్ నుంచి బయలుదేరిన హరి ఆ క్యాబ్‌లో ఎక్కడికి వెళ్లారు? ఆ డ్రైవర్ ఎవరు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 31 తర్వాత డెనాలి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు పడిపోయాయని, హరి గురించి ఎలాంటి సమాచారం లభించలేదని అతని స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)