Breaking News

కెనడా డ్రీమ్స్‌ : వాక్-ఇన్ ఓవెన్‌లో శవమై తేలిన వాల్‌మార్ట్‌ ఉద్యోగి

Published on Sat, 10/26/2024 - 12:55

కెనడాలోని హాలిఫాక్స్‌లోని  వాల్‌మార్ట్ వాక్-ఇన్ బేకరీ ఓవెన్‌లో వాల్‌మార్ట్ ఉద్యోగి, ఇండియాకు చెందిన సిక్కు  యువతి  శవమై  తేలడం దిగ్భ్రాంతి రేపింది.  మృతురాలిని ఈ బేకరీలోనే పనిచేస్తున్న 19 ఏళ్ల గుర్‌ సిమ్రాన్ కౌర్‌గా మారిటైమ్ సిక్కు సొసైటీ ధృవీకరించింది. కౌర్‌ మృతదేహాన్ని తొలుత గుర్తించిన ఆమె తల్లి అంతులేని దుఃఖంలో మునిగిపోయింది. బతికి ఉండగానే ఓవెన్‌లో వేసి  కాల్చారనే అనుమానాలు  మరింత ఆందోళన రేపుతున్నాయి. ఎన్నో కలలతో కెనడాకు వచ్చిన అందమైన యువతి అత్యంత విషాదంగా ‍ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో అంతులేని శోకాన్ని మిగిల్చింది. హాలిఫాక్స్ వాల్‌మార్ట్  ఆమె మరణంపై విచారంపై ప్రకటించింది. 

కాగా  ఇండియాకు చెందిన కౌర్ , ఆమె తల్లి మూడేళ్ల క్రితం కెనడాకు వెళ్లారు.  కౌర్ తండ్రి, సోదరుడు భారతదేశంలోనే ఉన్నారు. తల్లీ కూతుళ్లు ఇద్దరూ గత రెండేళ్లుగా మమ్‌ఫోర్డ్ రోడ్ వాల్‌మార్ట్‌లో పని చేస్తున్నారు. ఇద్దరూ స్థానిక సిక్కు కమ్యూనిటీలోమంచి పేరు తెచ్చుకున్నారు. అక్టోబర్ 19, శనివారం, కౌర్ తల్లి వాల్‌మార్ట్ స్టోర్ తెరిచి ఉండగానే బేకరీ డిపార్ట్‌మెంట్‌లో కాలిపోయిన తన బిడ్డను గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. ఇంత విషాదకరమైన నష్టానికి క్షమించండి అంటూ మారిటైమ్ సిక్కు సొసైటీ అధ్యక్షుడు హర్జిత్ సెయాన్ ప్రకటించారు. 

మరోవైపు అంత్యక్రియల ఖర్చులకు సహాయం, కౌర్ తండ్రి, ఇతర కుటుంబ సభ్యులను కెనడాకు తరలించేందుకు గోఫండ్‌బీ కేవలం 10 గంటల్లో  (గురువారం మధ్యాహ్నం నాటికి దాదాపు  ఒక లక్ష, 30వేల డాలర్ల ఫండ్‌ను సేకరించింది. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. వాల్‌మార్ట్‌ను మూసివేశారు. కౌర్  మరణం ఎలా సంభవించిందని అనేదానిపై ఇంకా ఎలాంటి క్లూ లభించలేదని హాలిఫాక్స్ ప్రాంతీయ పోలీసు అధికారి మార్టిన్ క్రోమ్‌వెల్ చెప్పారు.  కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. వాల్‌మార్ట్‌ను మూసివేశారు. 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)