Breaking News

శంకర నేత్రాలయ యూఎస్‌ఏ దార్శనిక దాతృత్వానికి నివాళి

Published on Mon, 09/15/2025 - 11:08

శంకర నేత్రాలయ USA తన అడాప్ట్-ఎ-విలేజ్ కంటి సంరక్షణ కార్యక్రమాల దిగ్విజయాన్ని స్మరించుకోవడానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వెనుకబడిన గ్రామాల్లో ఈ కార్యక్రమాలను విజయవంతంగా ఏర్పాటు చేసేందుకు సహకరించిన పోషకదాతల అమూల్యమైన అనుభవాలు, సూచనలను తెలుకునేందుకు వేదికగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. శంకర నేత్రాలయం యూఎస్‌ఏ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందూర్తి అధ్యక్షతన ఈ సమావేశం ఘనంగా జరిగింది. 

ఈ కార్యక్రమంతో దార్శనికులను, దాతల సముహాన్ని ఒకచోటుకి చేర్చింది. ఈ వేడుకలో పాల్గొన్న వారిలో మెగా డోనార్లు, బ్రాండ్‌ అంబాసిడర్లు, సలహాదార్లు, బోర్డు సభ్యులు ప్రసాద్‌ రెడ్డి కాటంరెడ్డి, శంకర్‌ సుబ్రమోనియన్‌ తదితరలు ఉన్నారు. ఈ వేడుక గ్రామీణ భారతదేశం అంతటా జీవితాలను ప్రకాశవంతం చేసేలా అడాప్ల్‌ ఎ విలేజ్‌ పోషకదాత ఉనికిని ప్రతిధ్వనించేలా చేసింది. 

ఈ సందర్భంగా దత్తత గ్రామ పోషకులు కంటి శిబిరాలను తాము సందర్శించి వివరాలను ప్రత్యక్షంగా పంచుకున్నారు. అక్కడ వారు ప్రతి రోగికి లభించిన కంటి సంరక్షణ, శస్త్రచికిత్సలు గురించి తెలుసుకున్నారు. ఒక రకంగా ఇది సంస్థ అచంచలమైన ప్రమాణాలను, లోతుగా పాతుకుపోయిన సేవతత్వాన్ని ధృవీకరిస్తోంది. చాలామంది రోగులకు దృష్టిని పునరుద్ధరించి అత్యంత దుర్భలమైన వారి జీవితాలను మార్చింది. 

తరతరాలుగా కంటి సంరక్షణను ముందుకు తీసుకువెళ్లడంలో భాగస్వామ్యం, దాతృత్యంతో నడిచే నాయకత్వం శక్తిని పునరుద్ఘాటించింది. శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు ఎస్.వి. ఆచార్య ప్రసంగంలో, సంస్థ దార్శనిక వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్.ఎస్. బద్రీనాథ్ అందించిన సహాయ సహకారాలు,వి లువలు గురించి వివరించారు. అలాగే అడాప్ట్-ఎ-విలేజ్ పోషకుల ఉదార మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

(చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?)

 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)