Breaking News

విదేశాల్లో వైఎస్సార్‌కు ఘన నివాళి

Published on Mon, 09/01/2025 - 03:55

సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో జనరంజక పాలన అందించిన గొప్ప వ్యక్తి దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని ప్రవాసాంధ్రులు కొనియాడారు. సెప్టెంబర్‌ 2న ఆయన వర్ధంతి సందర్భంగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియాలోని పలు నగరాల్లో ప్రవాసాంధ్రులు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ న్యూజిలాండ్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆక్లాండ్‌లోని సాండ్రింగ్‌హామ్‌ కమ్యూనిటీ సెంటర్‌లో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు వైఎస్సార్‌ చేసిన సేవలను కొనియాడారు.

సంక్షేమాభివృద్ధిలో వైఎస్సార్‌ ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ నాలుగు అడుగులు ముందుకేసి ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్‌ ఎద్దుల, సుమంత్‌ డేగపూడి, కృష్ణారెడ్డి, విజయ్‌ అల్లా, రాజారెడ్డి, బాలశౌర్య, గీతారెడ్డి, రమేష్‌ పానాటి, సంకీర్త్‌ రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, సుస్మిత, రేఖ, గౌతమి, సింధు, ప్రియాంక, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. 

 ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో వైఎస్సార్‌సీపీ విక్టోరియా విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమం

ఆ్రస్టేలియాలో రక్తదాన శిబిరం 
డాక్టర్‌ వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ఆ్రస్టేలియా విభాగం ఆధ్వర్యంలో ఆడిలైడ్‌ నగరంలో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో నాయకులు వంశీ బొంతు, రామ్మోహన్‌రెడ్డి మునగల తదితరులతో పాటు వైఎస్సార్, వైఎస్‌ జగన్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మెల్‌బోర్న్‌ నగరంలో వైఎస్సార్‌సీపీ విక్టోరియా విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. నాగార్జున యలగాల, అనిల్‌ కుమార్‌ పెడగాడ, హరి చెన్నుపల్లి తదితరులు పాల్గొన్నారు.

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)