ఉగాది సాహిత్య స​మ్మేళనం, ఎంట్రీలకు ఆహ్వానం!

Published on Fri, 02/21/2025 - 15:05

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా,  శ్రీ సాంస్కృతిక కళా సారథి- సింగపూర్ & వంశీ ఇంటర్నేషనల్- భారత దేశం  సంయుక్త ఆధ్వర్యంలో..విశ్వావసు నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగాఉగాది సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్నామని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.  ప్రవేశం ఉచితమని తెలిపారు. ‘విశ్వాససు’ నామ ఉగాది శుభ సందర్భంగా కొత్త సంవత్సరానికి ‘సాహిత్య స్వాగతం’ పలుకుతూ వైవిధ్యభరితమైన సాహిత్యాంశాలతో రోజంతా జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆనందించమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు, పండితులు, రచయితలు, సాహితీవేత్తలు, భాషాభిమానులందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం.

తేదీ:  ఏప్రిల్ 13, 2025, ఆదివారం
సమయం: ఉదయం 9:00 నుంచి రాత్రి 9:00 దాకా
వేదిక: శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్.

  • సంగ్రహ కార్యక్రమం

  •  ప్రారంభ సభ

  • కవి సమ్మేళనం

  • మహిళా పృఛ్ఛకులతో అష్టావధానం -  ‘ద్విశతావధాని’ డా బులుసు అపర్ణ

  • నూతన పుస్తకావిష్కరణ సభ-2025

కవి సమ్మేళనం నమోదు వివరాలు

భారత దేశం, సింగపూర్, అమెరికా దేశ సంస్థల నిర్వహణలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన సాహిత్య సమ్మేళనం లో పాల్గొని తమ స్వీయ కవితలని సభా ముఖంగా వినిపించే ఆసక్తి ఉన్నవారు సకాలంలో ఈ క్రింది లింక్ లో నమోదు చేసుకుని సహకరించమని కోరుతున్నాం.

నమోదు పత్రం
https://docs.google.com/forms/d/e/1FAIpQLSc8fSIPdScAsrz89h6Q9rAWNIqazuTtUeWPgpIpew93Wv3qEQ/viewform

నమోదు ఆఖరి తేదీ: మార్చ్ 15, 2025

• నమోదు పత్రం లో అందిన కవితలు మాత్రమే పరిశీలించబడతాయి.
• కవిత వ్యవధి 3 నిమిషాలు (25 వాక్యాలు) దాటరాదు.
• కవిత ఏదైనా సాహిత్య, సామాజిక, ఆధ్యాత్మిక అంశంపై రాయవచ్చు. మత కుల రాజకీయ ప్రసక్తి లేకుండా కవిత శుభసూచకంగా ఉండాలి.
• స్థానికులకి తగిన గుర్తింపు, బయట ప్రాంతాలనుండి వచ్చేవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
• కవితల ఎంపికలో అంతిమ నిర్ణయం నిర్వాహకులదే.

నూతన పుస్తకావిష్కరణలు
నమోదు ఆఖరి తేదీ: మార్చ్ 15, 2025 (ఉగాది)

‘విశ్వావసు’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనంలో తమ నూతన గ్రంధాలు సభా ముఖంగా ఆవిష్కరించ దలచుకున్న వారు వివరాలతో  సంప్రదించాలని, కేవలం 2025 లో ప్రచురించబడిన కొత్త పుస్తకాలు మాత్రమే ఆవిష్కరణకి పరిశీలిస్తామని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

వివరాలకోసం సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు

ప్రధాన సమన్వయ కర్త: రాధిక మంగిపూడి (+91 9029409696)
రత్న కుమార్ కవుటూరు +65 91735360 (సింగపూర్)
డా. వంశీ రామరాజు  +91 9849023852 (హైదరాబాద్)
డా. వంగూరి చిట్టెన్ రాజు +1 8325949054 (హ్యూస్టన్, టెక్సాస్, అమెరికా)

 మరిన్ని NRI  వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి: 
 

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)