Breaking News

నాట్స్ తెలుగు సంబరాలు సినీ ప్రముఖులకు ఆహ్వానం

Published on Tue, 03/18/2025 - 16:46

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ బృందం పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించింది. హైదరాబాద్‌లో తొలుత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావును కలిసి నాట్స్ 8 వ అమెరికా తెలుగు సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది.

నాట్స్ సంబరాలకు ముఖ్య అతిధిగా రాఘవేంద్రరావును కోరింది. ఆ తర్వాత వైజయంతీ మూవీస్ అధినేత అశ్వినీదత్‌ను కలిసి నాట్స్ సంబరాల ఆహ్వాన పత్రికను అందించింది. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ని కూడా నాట్స్ బృందం కలిసి సంబరాలకు ఆహ్వానించింది. జూలై 4, 5, 6 తేదీల్లో టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని కోరింది. 

అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు థమన్‌ను కూడా నాట్స్ బృందం కలిసింది. నాట్స్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా థమన్‌ కూడా గుర్తు చేసుకున్నారు. అమెరికా తెలుగు సంబరాలకు థమన్ తప్పనిసరిగా రావాలని నాట్స్ ఆహ్వానించింది.

మరిన్ని NRI  వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి!

సినీ దర్శకులు హరీశ్ శంకర్, మోహర్ రమేశ్‌లను కూడా కలిసి నాట్స్ ఆహ్వాన పత్రికలు అందించింది. సినీ ప్రముఖుల ఆహ్వానాలు అందించే కార్యక్రమంలో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమీటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ బిందు యలమంచిలి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ సుమిత్ అరికపూడి,  నాట్స్ మెంబర్ షిప్ నేషనల్ కోఆర్డినేటర్ ఆర్.కె. బాలినేని, నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ మాజీ కోఆర్డినేటర్  సురేశ్ బొల్లు తదితరులు  పాల్గొన్నారు.


 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)