Breaking News

అమెరికాలో వాల్‌మార్ట్‌లో అమ్మానాన్నలతో : ఎన్‌ఆర్‌ఐ యువతి వీడియో వైరల్‌

Published on Wed, 06/11/2025 - 16:18

పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం  సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని  పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి  నెట్టింట వైరల్‌గా మారింది.

అమెరికాలోని వాల్‌మార్ట్‌లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్‌మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్‌ రూం, జిమ్‌, స్విమ్మింగ్‌ పూల్‌, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది.  దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో ఇది ఆన్‌లైన్‌లో పలువురి  హృదయాలను  తాకింది.

 వాల్‌మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా  తన పేరెంట్స్‌ను ఆఫీసుకు తీసుకెళ్లింది.    లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.   తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు  ఈ చిన్న క్లిప్‌ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్‌ వచ్చాయి.  24,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.  

‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్‌మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి  సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ  దేవ్‌శ్రీ పోస్ట్‌ చేసింది.

చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు.  ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది.  "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్‌ ఈ అనుభూతి ఎప్పటికీ  దిబెస్ట్‌ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా  నెటిజన్లు కామెంట్‌ చేశారు. అంతేకాదు  తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)