Breaking News

NRI డాలస్‌లో యోగాడే సెలబ్రేషన్స్‌

Published on Fri, 06/27/2025 - 16:26

డాలస్, టెక్సాస్: అమెరికాలో ఇర్వింగ్ (డాలస్) నగరంలోని మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద జూన్ 21 న మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాదిమంది ప్రవాస భారతీయులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. గంటన్నరకు పైగా సాగిన యోగా, ధ్యాన కార్యక్రమానికి ‘హార్ట్ ఫుల్నెస్’ యోగా సంస్థ సారధ్యం వహించింది. ఈ కార్యక్రమంలో ఇషా ఫౌండషన్, ది ఐ వై ఇసి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, వన్ ఎర్త్ వన్ చాన్స్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, డి ఎఫ్ డబ్లు హిందూ టెంపుల్ మొదలైన సంస్థలనుండి వందలాదిమంది పాల్గొన్నారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వాల అతిథులందరికీ స్వాగతం పలికి, యోగా చెయ్యడం కోసం సుప్రభాత సమయంలో తరలివచ్చిన వారందరికీ ధన్యవాదములు అని సభను ప్రారంభించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కో ఛైర్మన్ రాజీవ్ కామత్ శుభాకాంక్షలు తెలియజేశారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “యోగా, ధ్యానం కేవలం జూన్ 21 న మాత్రమేగాక మన దైనందిన జీవితంలో దినచర్యలో ఒక భాగంగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. భారత ప్రధాని పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకం అన్నారు.”   

మరిన్ని NRI  వార్తలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాపర్ మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అన్ని వయస్సులవారు వందలాదిమంది ఈ రోజు యోగాలో పాల్గొనడం సంతోషం అని, ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిభావంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యవర్గ సభ్యులకు అభినందనలు అన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మరియు కార్యవర్గసభ్యుల విజ్ఞప్తి ననుసరించి, అతిత్వరలో 5 మిలియన్ డాలర్లకు పైగా ధనాన్నివెచ్చించి ఈ 18 ఎకరాల సుందరమైన పార్క్ లో వాకింగ్ ట్రాక్స్, ఎల్ యి డి విద్యుత్ దీపాలను మెరుగుపరుస్తామని ప్రకటించడంతో అందరూ హర్షధ్వానాలు చేశారు.

ప్రత్యేకఅతిథులుగా హాజరైన కాపెల్ నగర కౌన్సిల్ సభ్యులు బిజు మాథ్యూ, రమేష్ ప్రేమ్ కుమార్, ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ ట్రస్టీ బోర్డ్ సభ్యుడు సురేష్ మండువ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని కల్గించింది అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర సహచర కార్యవర్గ సభ్యులు రాజీవ్ కామత్, రావు కల్వాల, బి.ఎన్ రావు, తయాబ్కుండావాల, రాజేంద్ర వంకావాల, రాంకీ చేబ్రోలు, మహేంద్ర రావు, జె పి పాండ్య, రన్నా జానీ, అనంత్ మల్లవరపులతో కలసి అతిథులందర్నీ సత్కరించారు.

యోగా అనంతరం నిర్వాహాకులు చక్కటి ఉపాహారాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యుడు బి.ఎన్ రావు తన ముగింపు సందేశంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నవారికి, అతిథులకు, వివిధ ప్రసార మాధ్యమాలకు, హార్ట్ ఫుల్నెస్’ యోగా సంస్థ నిర్వాహాకులు సురేఖా కోయ, ఉర్మిల్ షా మరియు వారి బృంద సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)