టెన్షన్‌ లేని లైఫ్‌ కావాలి..అందుకే భారత్‌కి వచ్చేశా..!

Published on Thu, 02/12/2026 - 11:23

విదేశాలకు వెళ్లడం అక్కడే స్థిరపడటం చాలామంది డ్రీమ్‌. 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా విదేశాల్లోని అక్కడి సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం రా..రమ్మని ఆకర్షిస్తుంటుంది. తీరా వెళ్లాక గానీ తెలియదు. అక్కడి సమస్యలు..పరిస్థితులు. ఇక్కడొక భారత మహిళకు కూడా అలా అనిపించే తక్షణమే భారత్‌కు కుటుంబంతో సహా వచ్చి వాలిపోయింది. ఎందువల్ల తాను ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందో సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది. కానీ ఆమె చెబుతున్న మాటలు ఆలోచింపదగినవిగానూ విదేశాలకు చెక్కేద్దామనే ఔత్సాహుకులకు గొప్ప పాఠాలుగానూ ఉన్నాయి. మరి ఇంతకీ ఎందవల్ల ఇలా కుటుంబంతో సహా ఆమె భారత్‌కు వచ్చేసిందో తెలుసా..!?..

లీబా సుబిన్‌ అనే మహిళ కుటుంబం దుబాయ్‌ నుంచి భారత్‌లోని తన స్వస్థలం కేరళకు వచ్చేసింది. తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నెటిజన్లతో షేర్‌ చేసుకుంది. ఆమె కారణాన్ని వివరిస్తూ..ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా చేశానని అంటోంది. ఈ నిర్ణయాన్ని సమయా పాలన, మానసిక శాంతికి సంబంధించిన విషయంగా పేర్కొంది. అదీగాక తమ ఫ్యామిలీ వీసా రెన్యువల్‌, అలాగే ఇంటి అద్దె రెన్యువల్‌ చేయాల్సి ఉండగానే.. చకచక​ ఈ నిర్ణయం తీసుకుని వచ్చేసినట్లు తెలిపారు. 

అలాగని ఏదో హడావిడిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదని, బాగా ఆలోచించి, తన భాగస్వామితో, పిల్లలతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఇలా వెనక్కి వచ్చేసి కేరళలో తమ సొంతింటిలో నివశించడం వల్ల దుబాయ్‌లోని అద్దె టెన్షన్‌ తగ్గింది, అలాగే ఇక్కడి సమాజంలో నివశించడం వల్ల సామాజిక సంబంధాలు పునరుద్ధరింపబడతాయి. 

పైగా ఎలాంటి అప్పులు, ఈఎంఐల బెడద లేకుడా మానసిక ప్రశాంతతో గడపొచ్చు అని చెప్పుకొచ్చిందామె. పైగా పిల్లవాడికి కేరళలో అంతర్జాతీయ స్కూల్‌ ఇంటికి సమీపంలోనే ఉంది పదినిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ దుబాయ్‌లో 90 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుందని జోడించారామె. బహుశా మాకు అనిపించింది..మీకు వర్కౌట్‌ కాకపోవచ్చు, పైగా మీరు విదేశాల్లోనే కంఫర్ట్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తుండొచ్చని, అది వారి వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పింది. 

అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడూ..మొత్తం కుటుబ సభ్యులు కలసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం అన్ని విధాల శ్రేయస్కరం అంటూ తన పోస్ట్‌ని ముగించింది లీబా సుబిన్‌. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయంతో ఏకభవించారు, పైగా తిరిగి వెళ్లకూదనుకుంటున్న ఆమె నిర్ణయానికి స్వాగతం, శుభాకాంక్షలు అని పోస్టులు పెట్టారు. 

 

(చదవండి: ఆ హోటల్‌ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్‌!
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)