Breaking News

భారతీయ సంతతి ర్యాపర్‌ ఓవర్‌ యాక్షన్‌ : నెటిజన్ల తీవ్ర అగ్రహం

Published on Mon, 06/23/2025 - 12:43

కెనడియన్‌ ర్యాపర్,మోడల్ టామీ జెనెసిస్‌ అత్యుత్సాహంపై సోషల్‌ మీడియా భగ్గుమంటోంది. తన తాజా మ్యూజిక్ వీడియో 'ట్రూ బ్లూ'లో  ఆమె  అవతారం  కాళీ మాతను పోలి ఉండటం వివాదానికి  దారి తీసింది. అసలేంటీ వివాదం? ఎవరీ టామీ జెనెసిస్‌ తెలుసుకుందామా.

భారతీయ సంతతికి చెందిన కెనడియన్ రాపర్ టామీ  తన రాబోయే ఆల్బమ్ ప్రమోషన్‌లో భాగంగా ట్రూ బ్లూ మ్యూజిక్ వీడియో  క్లిప్పింగ్స్‌తోపాటు,   కొన్ని చిత్రాలను శనివారం  పోస్ట్‌ చేసింది. ట్రూ బ్లూ ప్రోమోలో నీలిరంగు బాడీ పెయింట్, బంగారు ఆభరణాలు,  నుదుటిన ఎర్రటి బొట్టు, శిలువ పట్టుకుని వీడియోను పోస్ట్‌ను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది.  బికినీ,  హై హీల్స్ ధరించి, సాంప్రదాయ భారతీయ శైలి బంగారు ఆభరణాలతో అలంకరించుకోవడం పలువురికి ఆగ్రహం తెప్పించింది. అసభ్యకరంగా రెచ్చగొట్టే విజువల్స్‌,  అనేక మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిందంటూ నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అటు హిందూవులు, ఇటు క్రైస్తవులను అవమానించి, వారి మనోభావాల్ని అగౌరవపరిచే చర్య అని  పేర్కొన్నారు.

తమిళ్‌-స్వీడిష్ సంతతికి చెందిన కెనడియన్ రాపర్‌ అసలు పేరు  జెనెసిస్ యాస్మిన్ మోహన్‌రాజ్. ఈమె తాజా మ్యూజిక్ వీడియోలోకాళీమాతను అభ్యంతరకరంగా చిత్రీకరించిడంతో పాటు, క్రైస్తవ శిలువను అవమానించిందంటూ  వివాదం రాజుకుంది. 

లైక్‌లు,వ్యూస్‌కోసం దైవాన్ని దూషించడం, మనోభావాల్ని దెబ్బతీయడం ఫ్యాషన్‌గా మారిపోయిందంటూ నెటిజన్లు మండి పడుతున్నారు."ఇది కేవలం మతాలను మాత్రమే కాదు భారతీయ సంస్కృతిని కూడా అపహాస్యం చేసిందంటూ సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ‘శ్వాస ముద్ర’ ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల న్యూ స్టడీ : ఆశ్చర్యకర ఫలితాలు

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)