భార్యాబిడ్డల్ని విమానం ఎక్కించి వచ్చాడో లేదో తీవ్ర గుండెపోటు, విషాదం

Published on Thu, 10/09/2025 - 17:40

ఇటీవలి కాలంలో వరుస ఎన్‌ఆర్‌ఐల మరణాలు ఆందోళన రేపుతున్నాయి. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో తన భార్య , కుమారుడికి వీడ్కోలు పలికిన కొన్ని గంటలకే UAEలో ఒక భారతీయ ప్రవాస ఇంజనీర్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుడిని హరిరాజ్ సుదేవన్‌ (37) (Hariraj Sudevan) గుర్తించారు.

కేరళలోని అలప్పు జిల్లాకు చెందిన 37 ఏళ్ల హరిరాజ్ సుదేవన్ హరిరాజ్ సుదేవన్ గత 12 ఏళ్లుగా యుఎఇలో నివసిస్తున్నాడు.  అయితే  తన భార్య డాక్టర్ అను అశోక్ ,  10 ఏళ్ల కుమారుడు ఇషాన్ దేవ్ హరి  కేరళ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వారిని  విమానాశ్రయంలో దింపిన కొన్ని గంటలకే అబుదాబిలో గుండెపోటుతో మరణించాడు. అల్లుడు  అకాల మరణంపై మామ అశోకన్‌ కేపీ  తీవ్ర విచారాన్ని ప్రకటించారు. ఆయన ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నామనంటూ  కంట తడిపెట్టారు.

ఆదివారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే ముందు తన కుమార్తె , మనవడు హరిరాజ్‌తో 10 రోజులు గడిపారని, అక్టోబర్ 27న తన కొడుకు పుట్టినరోజుకు హాజరు కావడానికి హరిరాజ్ ఈ నెల చివర్లో  రావాల్సి ఉందని గుర్తు చేసుకున్నారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన సుదేవన్, యుఎఇలో 12 సంవత్సరాలకు పైగా సీనియర్ ఆఫ్‌షోర్ కన్‌స్ట్రక్షన్ ఇంజనీర్‌గా  పనిచేస్తున్నారు. కుసాట్ నుండి బి.టెక్ ,ఐఐటీ మద్రాస్ నుండి ఎంటెక్ పట్టా పొందారు. హరిరాజ్, అబుదాబిలో సీనియర్ పనిచేస్తున్నారు. అంత్యక్రియల కోసం ఆయన మృతదేహాన్ని కేరళకు  తరలించారు.  థామస్ కుమార్తె పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి మా ఇంటికి వచ్చారని,  ఎంతో సంతోషంగా గడిపామని  సన్నిహిత స్నేహితుడు డిజిన్ థామస్  తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)