Breaking News

TAJ ఆధ్వర్యంలో టోక్యో ఓజిమాలో ఘనంగా దసరా వేడుకలు

Published on Mon, 11/02/2026 - 11:48

టోక్యో : జపాన్‌లోని తెలుగు సమాజానికి అండగా నిలుస్తున్న TAJ (Telugu Association of Japan) ఆధ్వర్యంలో టోక్యోలోని ఓజిమా 6-చోమ్ ప్రాంతంలో దసరా (విజయదశమి) వేడుకలను భక్తిశ్రద్ధలతో, భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించారు.

శనివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకల్లో జపాన్‌లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు, చిన్నారులు, కమ్యూనిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతీయ పండుగల విశిష్టతను, ఆధ్యాత్మికతను, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. శ్రీరాముడు రావణుడిపై సాధించిన విజయాన్ని, అమ్మవారి శక్తి మహిషాసురుడిపై సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు.

“ఎక్కడ ఉన్నా మన సంస్కృతి మనతోనే” అనే భావనతో, జపాన్‌లోని తెలుగు కుటుంబాలు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, ఆచారాలు, పండుగల ప్రాముఖ్యతను పరిచయం చేస్తూ, భావితరాలకు మన సంప్రదాయాలను అందించేందుకు కృషి చేస్తున్నాయి. విదేశీ గడ్డపై భారతీయ పండుగలను ఐకమత్యంతో జరుపుకోవడం ద్వారా తెలుగు సమాజంలో సాంస్కృతిక అనుబంధాలు, స్నేహభావం, సామాజిక ఐక్యత మరింత బలపడుతున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

పరస్పర దసరా పండుగ   శుభాకాంక్షలతో కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాలు, చిన్నారులు, TAJ సభ్యులు  సందడిగా గడిపారు అనంతరం ప్రసాద వితరణ, ఇతర ఏర్పాట్లు నిర్వహించారు. జపాన్‌లో తెలుగు భాష, సంస్కృతి, భారతీయ సంప్రదాయాలను కొనసాగిస్తూ, సమాజంలోని కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో TAJ నిరంతరం కృషి చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)