ఎన్‌ఆర్‌ఐ జంటను రూ. 15 కోట్లకు ముంచేసిన కేటుగాళ్లు

Published on Mon, 01/19/2026 - 17:52

డిజిటల్‌ అరెస్ట్‌ అంటూ కోట్ల రూపాయలు మోస పోతున్న కథనాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒక ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ దంపతులు ఏకంగా రూ. 15 కోట్లు  పోగొట్టుకున్న వైనం పలువుర్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాలు ఇలా  ఉన్నాయి..

డాక్టర్ ఇంద్ర తనేజా (77),ఆమె భర్త డాక్టర్ ఓం తనేజాను సైబర్‌ నేరగాళ్లు  టార్గెట్‌ చేశారు.  పోలీసులమని చెప్పి, మనీలాండరింగ్‌ ఆరోపణలు అంటూ భయపెట్టి  గత సంవత్సరం డిసెంబర్ 24 -జనవరి 9 వరకు దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-IIలోని డిజిటల్‌ అరెస్ట్‌ చేశారు.   వీరినుంచి రూ.14.85 కోట్లను దోచేశారు.నిందితులలో ఇద్దరు వ్యక్తులు తమ బ్యాంకు ఖాతాలను స్కామర్లకు అందించగా, మూడవ వ్యక్తి సహాయకుడిగా వ్యవహరించాడు

అశ్లీల వీడియోలు, మనీలాండరింగ్‌ కేసులో  20 కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని ఈ జంటను భయపెట్టేశారు. . మొత్తం రూ. 14.85 కోట్లలో, గరిష్టంగా రూ. 4 కోట్లు గుజరాత్‌లోని వడోదరలోని బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించారు. పోలీసులు రూ. 2.10 కోట్లను నిలిపివేయగలిగారు. డిసెంబర్ 26, 2025న అస్సాంలోని గౌహతిలోని జలుక్‌బరికి రూ.1.99 కోట్లు, ఆ తర్వాత డిసెంబర్ 29 , 30 తేదీల్లో ఒక్కొక్కరికి రూ.2 కోట్లు వడోదరలోని సామ సావ్లికి బదిలీ  అయినట్టు పోలీసులు గుర్తించారు.  ఇలా రకరకాలుగా ఖాతాలు ఛారిటబుల్ ఫౌండేషన్‌లు, కెమికల్ ట్రేడింగ్ కంపెనీలు, రిక్రూట్‌మెంట్ సంస్థలు, టూర్, ట్రావెల్ వ్యాపారాల పేర్లతో నమోదైన బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్‌ఫర్‌  చేయించుకున్నారు. 

అరెస్ట్‌ వారెంట్లు అంటూ వరుస వీడియో కాల్స్‌తో
టెలికాం అధికారులు, పోలీసు అధికారులుగా నటిస్తూ వరుస నకిలీ కాల్స్ ,వీడియో కాల్స్‌ తమను ఉక్కిరి బిక్కిరి చేసేశారని బాధితులు  వాపోయారు. మహారాష్ట్రలో FIR ,అరెస్ట్ వారెంట్లు జారీ  అయ్యాయని బెదిరించారు. అలాగే ఆమె నా పేరు మీద ఉన్న కెనరా బ్యాంక్ ఖాతాను  ఒక ఒక పెద్ద మోసంలో ఉపయోగించారని భయపెట్టాడు.  దీంతో తన భర్త AIIMSలోఅపరేషన్‌ తరువాత కోటుకుంటున్నారని, పైగా  తమకు ఎవరూ సామయం చేసేవారు లేకపోవడంతో  రూ. 14.85 కోట్లు కోల్పోయాని తెలిపారు.

 

ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్‌ సిరప్‌ బ్యాన్‌

ఈ కేసులోగుజరాత్‌లోని వడోదర నివాసితులు దివ్యాంగ్ పటేల్, కృతిక్ షిటోలి, ప్రయాగ్‌రాజ్‌కు చెందిన కెఎస్ తివారీ నిందితులుగా గుర్తించారు. చైనా, కంబోడియాకు చెందిన స్కామర్‌లతో వీరికేమైనా సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)